Asia cup 2022 SLvs PAk: ఫైనల్‌కు ముందు శ్రీలంకతో పాక్‌ పోరు.. స్టార్‌ బౌలర్‌కు విశ్రాంతి!

9 Sep, 2022 19:26 IST|Sakshi

ఆసియాకప్‌-2022 సూపర్‌-4 అఖరి మ్యాచ్‌లో శ్రీలంక-పాకిస్తాన్‌ జట్లు దుబాయ్‌ వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కాగా ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌లో ఇరు జట్లు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ నామమాత్రపు మ్యాచ్‌లో శ్రీలంక, పాకిస్తాన్‌ రెండేసి మార్పులతో బరిలోకి దిగాయి. శ్రీలంక జట్టులోకి ధనంజయ డి సిల్వా, ప్రమోద్ మదుషన్ ఎంట్రీ ఇవ్వగా.. పాక్ జట్టులోకి హాసన్‌ అలీ, ఉస్మాన్ ఖాదిర్ వచ్చారు. కాగా ఈ మ్యాచ్‌కు పాక్‌ స్టార్‌ ఆటగాళ్లు నసీం షా, షాదాబ్‌ ఖాన్‌కు విశ్రాంతి ఇచ్చారు.
తుది జట్లు:
పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్‌ కీపర్‌), బాబర్ ఆజం(కెప్టెన్‌), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, హారీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హస్నైన్

శ్రీలంకపాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), ధనంజయ డి సిల్వా, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక
చదవండి: Asia cup 2022 Afg vs Ind: 'టీమిండియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు.. ఐపీఎల్‌ కోసమే'

మరిన్ని వార్తలు