Asia Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌.. దీపక్‌ హుడాకు నో ఛాన్స్‌! అశ్విన్‌కు కూడా!

27 Aug, 2022 15:35 IST|Sakshi
PC: BCCI Twitter

Wasim Jaffer Picks India XI for Pakistan clash: ఆసియాకప్‌-2022లో భాగంగా భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆదివారం తలపడనున్న సంగతి తెలిసిందే. దాయాదుల పోరు కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌ను భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ ఎంచుకున్నాడు.

తన ప్రకటించిన జట్టులో ఓపెనర్లగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ను జాఫర్‌ ఎంపిక చేశాడు. ఆవే విధంగా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి మూడో స్థానంలో అవకాశమిచ్చాడు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాకు అతడు చోటిచ్చాడు. ఇక ఆరో స్థానం కోసం దినేష్‌ కార్తీక్‌, రిషబ్‌ పంత్‌ మద్య తీవ్రమైన పోటీ ఉన్నట్లు జాఫర్‌ పేర్కొన్నాడు.

ఒక వేళ పంత్‌ తుది జట్టులో ఉన్నట్లైతే ఖచ్చితంగా ఐదో స్ధానంలో బ్యాటింగ్‌ వస్తాడని జాఫర్‌ తెలిపాడు. ఇక తన ఎంచుకున్న జట్టులో ఫుల్‌టైమ్‌ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకు స్ధానం కల్పించాడు. ఇక బౌలర్ల కోటాలో భువనేశ్వర్‌ కుమార్‌, రవి బిష్ణోయి, చహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌కు జాఫర్‌ చోటు ఇచ్చాడు. కాగా ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దీపక్‌ హుడాను జాఫర్‌ ఎంపిక చేయకపోవడం గమనార్హం. మరోవైపు వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు.

పాక్‌తో మ్యాచ్‌కు జాఫర్‌ ఎంచుకున్న ప్లేయింగ్‌ ఎలెవన్‌
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్‌/ దినేష్‌ కార్తీక్‌, రవీంద్ర జడేజా,యజువేంద్ర చహల్‌, రవి బిష్ణోయి, భువనేశ్వర్‌కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

చదవండి: Asia Cup 2022: మనసులో మాటను బయటపెట్టిన పాక్‌ ఆల్‌రౌండర్‌

మరిన్ని వార్తలు