ఆసియా కప్ 2023 విజేతగా టీమిండియా అవతరించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఎనిమిదో సారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్‌మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.
అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
ఆసియా కప్ 2023 టాప్ పెర్ఫార్మర్స్ వీరే..!
2023 ఆసియా కప్‌లో టాప్ పెర్ఫార్మెన్స్‌లపై ఓ లుక్కేస్తే, ఈ జాబితాలో అంతా టీమిండియా ఆటగాళ్లే కనిపిస్తారు. అత్యధిక పరుగులు, అత్యధిక బౌండరీలు, అత్యధిక సిక్సర్లు, అత్యుత్తమ బౌలింగ్ సగటు, అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.. ఇలా దాదాపు ప్రతి విభాగంలో భారత ఆటగాళ్లు టాప్‌లో ఉన్నారు.