Asia Cup: జపాన్‌ చేతిలో భారత్‌ పరాజయం 

28 Sep, 2021 07:45 IST|Sakshi

Asia Cup Basketball Tourney: జోర్డాన్‌లో జరుగుతున్న ఆసియా కప్‌ మహిళల బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌ గ్రూప్‌ ‘ఎ’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 46–136 (14–41, 11–25, 14–38, 7–32) పాయింట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌ చేతిలో ఓడిపోయింది. 10 నిమిషాల చొప్పున నిడివిగల నాలుగు క్వార్టర్స్‌లో ఏ దశలోనూ భారత్‌ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. భారత్‌ తరఫున పుష్ప 11 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. జపాన్‌ తరఫున మియాషితా 27, మోనికా ఒకోయె 24, హరునో నెమోటో 17 పాయింట్లు స్కోరు చేశారు. 

చదవండి: Inzamam ul Haq: పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌కు గుండెపోటు..

మరిన్ని వార్తలు