PAK Vs HK Asia Cup 2022: శివాలెత్తిన పాక్‌ బ్యాటర్లు.. హాంగ్‌ కాంగ్‌ ముందు భారీ లక్ష్యం

2 Sep, 2022 21:26 IST|Sakshi

ఆసియాకప్‌లో భాగంగా గ్రూఫ్‌-ఏలో హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. మహ్మద్‌ రిజ్వాన్‌(57 బంతుల్లో 78 పరుగులు నాటౌట్‌, 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) బాధ్యతాయుతంగా ఆడగా.. ఫఖర్‌ జమాన్‌(41 బంతుల్లో 53, 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించగా.. ఆఖర్లో కుష్‌దిల్‌ షా(15 బంతుల్లో 35 పరుగులు నాటౌట్‌, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.

అంతకముందు టాస్‌ గెలిచి పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌ ఆహ్వానించిన హాంగ్‌ కాంగ్‌కు ఆరంభంలో బాబర్‌ ఆజం రూపంలో బిగ్‌ వికెట్‌ లభించింది. కానీ ఆ తర్వాత మహ్మద్‌ రిజ్వాన్‌, ఫఖర్‌ జమాన్‌లు మరో వికెట్‌ పడకుండా ఆడారు. ఇద్దరి మధ్య వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదైంది. ఫిప్టీ పూర్తి చేసిన తర్వాత ఫఖర్‌ జమాన్‌ ఔటైనప్పటికి.. చివర్లో కుష్‌దిల్‌ షా విధ్వంసంతో పాక్‌ భారీ స్కోరు సాధించింది. హాంగ్‌ కాంగ్‌ బౌలర్లలో ఎహ్‌సాన్‌ ఖాన్‌ రెండు వికెట్లు తీశాడు.

చదవండి: Babar Azam: 'నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు!'


 

మరిన్ని వార్తలు