Asia Cup 2022 Final: పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన రాజపక్స..

11 Sep, 2022 21:33 IST|Sakshi

ఆసియా కప్‌ టోర్నీలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఫైనల్‌ పోరులో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 71, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. అంతకముందు దనుంజయ డిసిల్వా 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన లంక.. కనీసం 150 పరుగుల మార్క్‌ను దాటుతుందా అన్న అనుమానం కలిగింది.

కానీ వనిందు హసరంగాతో కలిసి రాజపక్స ఆరో వికెట్‌కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 36 పరుగులు చేసి హసరంగా వెనుదిరిగిన తర్వాత రాజపక్స పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు చమిక కరుణరత్నే(14 బంతుల్లో 14 పరుగులు) చక్కగా సహకరించడంతో చివరి ఐదు ఓవర్లలో 64 పరుగులు రావడం విశేషం. శ్రీలంక స్కోరు 170 ఉండగా.. అందులో రాజపక్సవే 71 పరుగులు ఉన్నాయి. పాకిస్తాన్‌ బౌలర్లలో హారిస్‌ రౌఫ్‌ 3, నసీమ్‌ షా, షాదాబ్‌ ఖాన్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

చదవండి: Kushal Mendis: అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక బ్యాటర్‌ అత్యంత చెత్త రికార్డు

మరిన్ని వార్తలు