Hasan Ali: మహిళా అభిమానికి ఫిదా.. 'ఐ లవ్‌ ఇండియా' అన్న పాక్‌ క్రికెటర్‌

31 Aug, 2022 12:26 IST|Sakshi

పాకిస్తాన్‌ పేసర్‌ హసన్‌ అలీ భారతీయ మహిళా అభిమానికి ఫిదా అయ్యాడు. తనపై ఆమె చూపించిన అభిమానానికి ముగ్దుడైన హసన్‌ అలీ.. 'ఐ లవ్‌ ఇండియా' అని చెప్పడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. మంగళవారం రాత్రి పాకిస్తాన్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో భారత్‌కు చెందిన ఒక మహిళ అభిమాని అక్కడికి  వచ్చింది. ఆమెతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. కాగా పాక్‌ క్రికెటర్లంతా ప్రాక్టీస్‌ ముగించుకొని డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్తున్న సమయంలో తమ కెమెరాలతో ఫోటోలు క్లిక్‌మనిపించారు.

ఈ సమయంలో అక్కడినుంచి వెళుతున్న హసన్‌ అలీని ఆపి.. ''మీకు భారత్‌లో కూడా ఫ్యాన్స్‌ ఉన్నారు.'' అని మహిళ పక్కన ఉన్న వ్యక్తి పేర్కొంటూ సెల్ఫీ కావాలని అడిగాడు. ''అవును మాకు ఇండియాలో కూడా అభిమానులు ఉంటారు.. ఐ లవ్‌ ఇండియా..'' అని పేర్కొన్నాడు. ఆ తర్వాత సదరు మహిళతో ఫోటోలకు ఫోజిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌గా మారాయి.

ఇక హసన్‌ అలీ భార్య సమియా ఆర్జూ భారత సంతతికి చెందిన మహిళ కావడం విశేషం. ఇక మొదట హసన్‌ అలీ ఆసియాకప్‌కు పీసీబీ ప్రకటించిన జట్టులో లేడు. మహ్మద్‌ వసీమ్‌ గాయపడడంతో అతని స్థానంలో హసన్‌ అలీని ఎంపిక చేశారు. ఇక చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్‌లో హసన్‌ అలీకి అవకాశం రాలేదు. హసన్‌ అలీ కంటే హారిస్‌ రౌఫ్‌, షాహనవాజ్‌ దహాని, నసీమ్‌ షాల త్రయంవైపే కెప్టెన్‌ బాబర్‌ ఆజం మొగ్గు చూపాడు. అయితే టీమిండియాతో మ్యాచ్‌లో యంగ్‌ బౌలర్‌ నసీమ్‌ గాయపడడంతో హాంకాంగ్‌తో మ్యాచ్‌కు హసన్‌ అలీ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. 

కాగా టీమిండియా బుధవారం హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే గ్రూఫ్‌-ఏ నుంచి సూపర్‌-4కు టీమిండియా అర్హత సాధించనుంది. మరోవైపు టీమిండియాతో చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్‌.. హాంకాంగ్‌తో జరగనున్న మ్యాచ్‌లో గెలిచి రెండో జట్టుగా పాక్‌ సూపర్‌-4లో అడుగుపెట్టాలని ఆశపడుతుంది.

చదవండి: Nazibulla Zardan: ఆరు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సాధించిన అఫ్గన్‌ బ్యాటర్‌

ఆసియా కప్‌లోనే మరోసారి పాక్‌తో తలపడనున్న టీమిండియా..!

మరిన్ని వార్తలు