ఆసియా కప్‌లో రూపిందర్‌ సారథ్యంలో బరిలోకి...

10 May, 2022 07:37 IST|Sakshi

ఈనెల 23 నుంచి జకార్తాలో జరిగే ఆసియా కప్‌ పురుషుల హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు సీనియర్‌ డ్రాగ్‌ఫ్లికర్‌ రూపిందర్‌ పాల్‌ సింగ్‌ కెప్టెన్‌గా... డిఫెండర్‌ బీరేంద్ర లాక్రా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. భారత్‌తోపాటు ఈ టోర్నీలో జపాన్, పాకిస్తాన్, ఇండోనేసియా, మలేసియా, కొరియా, ఒమన్, బంగ్లాదేశ్‌ జట్లు బరిలో ఉన్నాయి. టాప్‌–3లో నిలిచిన జట్లు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశం హోదాలో భారత్‌కు నేరుగా ప్రపంచకప్‌లో ఎంట్రీ లభించింది. 

మరిన్ని వార్తలు