భారత ఆర్చర్ల పసిడి పంట

26 Dec, 2022 06:25 IST|Sakshi
మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో క్లీన్‌ స్వీప్‌ చేసిన భారత ఆర్చర్లు అదితి, ప్రగతి, పర్ణీత్‌

షార్జా: ఆసియా కప్‌ స్టేజ్‌–3 ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత ఆర్చర్లు అదరగొట్టే ప్రదర్శన చేశారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత్‌కు మొత్తం తొమ్మిది పతకాలు లభించాయి. ఇందులో ఐదుస్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం ఉన్నాయి. కాంపౌండ్‌ విభాగంలో భారత్‌కు ఏకంగా ఏడు పతకాలు దక్కాయి. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో భారత అమ్మాయిలు క్లీన్‌స్వీప్‌ చేశారు. ప్రగతి స్వర్ణం నెగ్గగా... అదితి స్వామి రజతం, పర్ణీత్‌ కౌర్‌ కాంస్య పతకం కైవసం చేసుకుంది.

పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో ప్రియాంశ్‌ స్వర్ణం, ఓజస్‌ రజతం నెగ్గారు. కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు పసిడి పతకాలు దక్కించుకున్నాయి. ఆకాశ్, మృణాల్‌ చౌహాన్, పార్థ్‌ సాలుంకేలతో కూడిన భారత రికర్వ్‌ పురుషుల జట్టు టీమ్‌ విభాగంలో బంగారు పతకం గెలుచుకుంది. రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో త్రిషా పూనియా, పార్థ్‌ సాలుంకేలతో కూడిన టీమిండియా రజతం నెగ్గింది.  

మరిన్ని వార్తలు