Asia Cup 2022: సూపర్‌-4కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్‌.. గాయంతో జడేజా ఔట్‌

2 Sep, 2022 17:46 IST|Sakshi
Photo Credit: BCCI Twitter

ఆసియాకప్‌లో ఫెవరెట్‌గా కనిపిస్తోన్న టీమిండియాకు బిగ్‌షాక్‌ తగలింది. మోకాలి గాయంతో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆసియాకప్‌ టోర్నీ నుంచి వైదొలిగినట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. కాగా జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌ ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం జడేజా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది.

''మోకాలి గాయంతో జడేజా ఆసియాకప్‌ దూరమయ్యాడు. అతని స్థానంలో అక్షర్‌ పటేల్‌ జట్టులోకి రానున్నాడు. ఆసియాకప్‌కు స్టాండ్‌-బై క్రికెటర్‌గా ఉన్న అక్షర్‌.. ఇప్పుడు తుది జట్టులోకి రానున్నాడు. దుబాయ్‌లోని జట్టుతో కలవనున్నాడు. జడేజా గాయం తీవ్రతపై స్పష్టం లేదు.'' అంటూ పేర్కొంది.

కాగా ఆసియాకప్‌లో టీమిండియా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ జడేజా ఆడాడు. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో జడేజాకు బ్యాటింగ్‌ అవకాశం రానప్పటికి ఫీల్డింగ్‌లో మెరిశాడు. టీమిండియా సూపర్‌-4కు చేరుకున్న తరుణంలో జడేజా దూరమవ్వడం టీమిండియాకు కోలుకోలేని దెబ్బే అని చెప్పొచ్చు. సూపర్‌-4లో భాగంగా  ఆదివారం బి2(పాకిస్తాన్‌ లేదా హాంకాంగ్‌)తో జరిగే మ్యాచ్‌కు అక్షర్‌ పటేల్‌ లేదా దీపక్‌ హుడాలలో ఎవరు జట్టులోకి వస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఆసియా కప్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ,ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్

చదవండి: Neeraj Chopra-BCCI: నీరజ్‌ చోప్రా 'జావెలిన్‌'కు భారీ ధర.. దక్కించుకుంది ఎవరంటే?

గత రికార్డులు ఘనమే! కానీ ఇప్పుడు హాంగ్‌ కాంగ్‌ను పాక్‌ లైట్‌ తీసుకుంటే అంతే

>
మరిన్ని వార్తలు