Harshada Garud Won: యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్షదకు స్వర్ణం 

20 Jul, 2022 08:25 IST|Sakshi
యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్షదకు స్వర్ణం(PC: SAI Media)

తాష్కెంట్‌లో జరుగుతున్న ఆసియా యూత్, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన  హర్షద గరుడ్‌ బంగారు పతకం సాధించింది. మహిళల 45 కేజీల కేటగిరీలో 18 ఏళ్ల భారత లిఫ్టర్‌ 157 కేజీల (స్నాచ్‌లో 69+ క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 88) బరువెత్తి విజేతగా నిలిచింది. మరో భారత లిఫ్టర్‌ సౌమ్య దాల్వి 145 కేజీల (63+82)తో కాంస్యం గెలుచుకుంది. పురుషుల 49కేజీల యూత్‌ ఈవెంట్‌లో ధనుశ్‌ (స్నాచ్‌లో 85 కేజీలు) కాంస్యం గెలిచాడు. 

చదవండి: Babar Azam: కోహ్లిని తలపిస్తున్న పాక్‌ కెప్టెన్‌.. ఖాతాలో మరో మైలురాయి

మరిన్ని వార్తలు