స్టన్నింగ్‌ క్యాచ్‌.. అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్‌

16 Feb, 2023 21:10 IST|Sakshi

మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్‌ గ్రేస్‌ హారిస్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిసింది. దాదాపు 20 గజాల దూరం పరిగెత్తి డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. శ్రీలంక ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది.

ఎలిస్సే పెర్రీ వేసిన బంతిని చమేరీ ఆటపట్టు లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడాలని ప్రయత్నించింది. కానీ బ్యాట్‌ ఎడ్జ్‌ తాకిన బంతి గాల్లోకి లేచింది. మిడాన్‌లో ఉన్న గ్రేస్‌ హారిస్‌ తన కుడివైపునకు కొన్ని గజాల దూరం పరిగెత్తి డైవ్‌ చేసి బంతిని అందుకుంది. ఆమె అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్‌ చెప్పకుండా మాత్రం ఉండలేం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక హారిస్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మాత్రమే కాదు బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. మూడు ఓవర్లు వేసిన గ్రేస్‌ హారిస్‌ ఏడు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక వుమెన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. మాదవి 34 పరుగులు చేయగా.. విశ్మి గుణరత్నే 24 పరుగులు చేసింది. ఆసీస్‌ వెటరన్‌ పేసర్‌ మేఘన్‌ స్కాట్‌ నాలుగు వికెట్లతో చెలరేగింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 15.5 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా టార్గెట్‌ను చేధించింది. బెత్‌ మూనీ 56 నాటౌట్‌, అలీసా హేలీ 54 నాటౌట్‌ ఆసీస్‌ను గెలిపించారు. లీగ్‌ దశలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా మూడో విజయం. ఈ విజయంతో సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. 

చదవండి: 'క్షమించండి'.. ఇలా అయితే ఎలా పెద్దన్న!

మరిన్ని వార్తలు