Aus Vs Eng 1st ODI: స్టార్క్‌ అద్బుత ఇన్‌స్వింగర్‌.. షాట్‌ ఎలా ఆడాలిరా బాబూ! బిక్క ముఖం వేసిన రాయ్‌

17 Nov, 2022 12:14 IST|Sakshi
PC: Cricket Australia Twitter

England tour of Australia, 2022 - Australia vs England: ఆస్ట్రేలియాతో మొదటి వన్డే నేపథ్యంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ పూర్తిగా నిరాశపరిచాడు. అడిలైడ్‌ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో అతడిని పెవిలియన్‌కు పంపాడు. 

బిక్క ముఖం వేసిన రాయ్‌
ఐదో ఓవర్‌ రెండో బంతికి రాయ్‌ను బోల్తా కొట్టించాడు. బాల్‌ దూసుకురావడంతో షాట్‌కు యత్నించాలో లేదో తెలియక తికమక పడ్డాడు రాయ్‌. అంతలోనే బ్యాట్‌, ప్యాడ్స్‌కు మధ్య నుంచి దూసుకెళ్లిన బంతి వికెట్‌ను తాకింది. దీంతో బౌల్డ్‌ అయిన జేసన్‌ రాయ్‌ బిక్క ముఖం వేసి మైదానాన్ని వీడాడు. కాగా గత కొన్నాళ్లుగా విఫలమవుతున్న జేసన్‌రాయ్‌కు టీ20 ప్రపంచకప్‌-2022 జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే.

స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆఖరి టీ20, వన్డే మ్యాచ్‌ ఆడిన అతడికి.. చాలా కాలం తర్వాత జట్టులో చోటు దక్కింది. అయినా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక రాయ్‌ చతికిలపడ్డాడు. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో మొదటి వన్డేలో ఓపెనర్లుగా బరిలోకి దిగిన రాయ్‌, ఫిలిప్‌ సాల్ట్‌ వరుసగా 6, 14 పరుగులు మాత్రమే చేయగా.. డేవిడ్‌ మలన్‌ అద్బుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 

చదవండి: కోహ్లిని చూసి నేర్చుకో! మొండితనం పనికిరాదు.. జిడ్డులా పట్టుకుని వేలాడుతూ: పాక్‌ మాజీ క్రికెటర్‌

మరిన్ని వార్తలు