Alex Carey: తొలి వికెట్‌ కీపర్‌గా అలెక్స్‌ క్యారీ సరికొత్త చరిత్ర

28 Dec, 2022 14:23 IST|Sakshi

Australia vs South Africa, 2nd Test- Alex Carey: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్‌ క్యారీ సెంచరీతో మెరిశాడు. బుధవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 149 బంతుల్లో 111 పరుగులు సాధించాడు. కాగా టెస్టు క్రికెట్‌లో అలెక్స్‌ క్యారీకి ఇదే తొలి శతకం. 

అంతేగాకుండా.. ఈ అద్భుత ఇన్నింగ్స్‌ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు అలెక్స్‌ క్యారీ. బాక్సింగ్‌ డే టెస్టులో మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా.. సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కీపర్‌గా ఘనత సాధించాడు. 

ఇక డేవిడ్‌ వార్నర్‌ డబుల్‌ సెంచరీకి తోడు స్టీవ్‌ స్మిత్‌(85) సహా ట్రవిస్‌ హెడ్‌(51), కామెరాన్‌ గ్రీన్‌ (51- నాటౌట్‌) అర్ధ శతకాలతో రాణించగా.. క్యారీ సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో 8 వికెట్ల నష్టానికి 575 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. మరోవైపు.. మూడో రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 15 పరుగులు చేసింది.

చదవండి: Ind Vs SL T20 Series: సెంచరీ బాదినా కనబడదా? నువ్వు ఐర్లాండ్‌ వెళ్లి ఆడుకో​! ఇక్కడుంటే..
Devon Conway: కాన్వే అరుదైన రికార్డు! తొలి కివీస్‌ బ్యాటర్‌గా.. కానీ అదొక్కటే మిస్‌!

మరిన్ని వార్తలు