Aus Vs SA 2nd Test: వేలంలో రూ.17.5 ​కోట్లు! కెరీర్‌లో తొలిసారి ఇలా! దెబ్బకు తోకముడిచిన ప్రొటిస్‌!

26 Dec, 2022 13:11 IST|Sakshi
గ్రీన్‌కు సహచరుల అభినందన (PC: CA Twitter)

Australia vs South Africa, 2nd Test- Day 1- Cameron Green: దక్షిణాఫ్రికాతో బాక్సింగ్‌ డే టెస్టులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మెల్‌బోర్న్‌లో సోమవారం ఆరంభమైన రెండో టెస్టు సందర్భంగా ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. రెండు కీలక వికెట్లు కూల్చి డీన్‌ ఎల్గర్‌ బృందాన్ని కోలుకోలేని దెబ్బకొట్టాడు. మొత్తంగా 10.4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చిన గ్రీన్‌.. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.

తొలిసారి ఇలా
కెరీర్‌లో తొలిసారి ఈ ఫీట్‌(5 వికెట్‌ హాల్‌) నమోదు చేశాడు. ఇక గ్రీన్‌ దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుదేలైంది. 189 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కాగా ప్రొటిస్‌ టాపార్డర్‌ విఫలమైన వేళ.. ఆరోస్థానంలో వచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ వెయిర్నే(52), మార్కో జాన్సెన్‌(59) అర్ధ శతకాలతో రాణించారు.


నాథన్‌ లియాన్‌తో గ్రీన్‌(PC: ICC)

అయితే, వీరిద్దరిని పెవిలియన్‌కు పంపాడు గ్రీన్‌. ఈ ఇద్దరితో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ థీనిస్ డి బ్రూయిన్(12), రబడ(4), లుంగి ఎన్గిడి(2) వికెట్లు తీశాడు. ఇక గ్రీన్‌కు తోడు స్టార్క్‌ 2, బోలాండ్‌ 1, నాథన్‌ లియోన్‌ 1 ఒక వికెట్‌ పడగొట్టారు. ప్రొటిస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ను ఎల్గర్‌ లబుషేన్‌ రనౌట్‌ చేశాడు.

ఈ నేపథ్యంలో 189 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌ మొదలెట్టిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్‌ నష్టపోయి 45 పరుగులు చేసింది. 100వ టెస్టు ఆడుతున్న ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 32, వన్‌డౌన్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ముంబై ఇండియన్స్‌ సంబరం
ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ మినీ వేలం-2023 నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ను గ్రీన్‌ను రూ. 17.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆక్షన్‌ తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఈ 23 ఏళ్ల యువ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఈ మేరకు కెరీర్‌లో ఉత్తమ గణాంకాలు(5/27) నమోదు చేయడం గమనార్హం.

దీంతో ముంబై ఫ్రాంఛైజీ ఖుషీ అవుతోంది. గ్రీన్‌ను కొనియాడుతూ ట్వీట్‌ చేసింది. ఈ క్రమంలో ఫ్యాన్స్‌.. ‘‘ముంబైకి మంచి రోజులు రాబోతున్నాయి. మనం మరోసారి మ్యాజిక్‌ చేయబోతున్నాం. ఇలాంటి యంగ్‌ టాలెంట్‌ మనకు కావాలి. ఇండియన్‌ పిచ్‌లపై కూడా గ్రీన్‌ ఇలాగే రాణించాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: Mohammad Rizwan: వైస్‌ కెప్టెన్‌పై వేటు! 4 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. సొంతగడ్డపై తొలి మ్యాచ్‌.. ఆఫ్రిదిపై విమర్శలు
KL Rahul: రాహుల్‌ వరుస సెంచరీలు చేయాలి! లేదంటే కష్టమే!.. గిల్‌కు అన్యాయం చేసినట్లే కదా!

మరిన్ని వార్తలు