World Cup 2023: బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల తేడాతో శ్రీలంక చిత్తు

17 Oct, 2023 11:13 IST|Sakshi

స్పిన్‌ వలలో లంక విలవిల

125/0 నుంచి 209 ఆలౌట్‌

నాలుగు వికెట్లతో తిప్పేసిన జంపా

రాణించిన మార్‌‡్ష, ఇంగ్లిస్‌  

లక్నో: ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా ఎట్టకేలకు ఈ వన్డే వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆసీస్‌ మూడో మ్యాచ్‌లో శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆడమ్‌ జంపా స్పిన్, బ్యాటర్ల సమష్టి బాధ్యత ‘కంగారూ’ జట్టును గెలిపించాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది.

ఓపెనర్లు కుశాల్‌ పెరీరా (82 బంతుల్లో 78; 12 ఫోర్లు), నిసాంక (67 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జంపా (4/47) తిప్పేయగా, పేసర్‌ స్టార్క్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్‌ 35.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి నెగ్గింది. మిచెల్‌ మార్‌‡ ్ష(51బంతుల్లో 52; 9 ఫోర్లు), జోష్‌ ఇంగ్లిస్‌ (59 బంతుల్లో 58; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో రాణించారు. మదుషంకకు 3 వికెట్లు దక్కాయి.

శుభారంభానికి స్పిన్‌తో చెక్‌
లంక ఓపెనర్లు ఆడిన ఆట, చేసిన పరుగులు, జతకూడిన భాగస్వామ్యం చూస్తే భారీస్కోరు గ్యారంటీ అనిపించింది! దీంతో ఒకదశలో ఆసీస్‌కు మళ్లీ ఓటమి కంగారూ తప్పదేమో అనిపించింది. అంతలా నిసాంక, కుశాల్‌ పెరీరా ఓపెనింగ్‌ జోడీ 21 ఓవర్లదాకా అర్ధసెంచరీలతో పరుగుల్ని పోగేసింది. అయితే కమిన్స్‌ పేస్‌ ఇద్దరిని స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు పంపించింది. దీంతో 125 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడ్డాక... స్పిన్‌ వైపు పిచ్‌ మళ్లింది. ఇదే అదనుగా జంపా... కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ (9), సమరవిక్రమ (8)లను అవుట్‌ చేశాడు. మరో స్పిన్నర్‌ మ్యాక్స్‌వెల్‌ అసలంక (25) వికెట్‌ తీయగా ఆ తర్వాత ఎవరూ పది పరుగులైనా చేయనీకుండా జంపా స్పిన్‌ ఉచ్చు, స్టార్క్‌ నిప్పులు చెరిగే బౌలింగ్‌ లంకను ఉక్కిరిబిక్కిరి చేసింది. 157 వద్ద రెండో వికెట్‌ పడిన లంక అనూహ్యంగా 209 పరుగులకే కుప్పకూలింది. కేవలం 52 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లను కోల్పోయింది.

తడబడినా...
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్‌ మళ్లీ తడబడింది. వార్నర్‌ (11; 1 సిక్స్‌), స్టీవ్‌ స్మిత్‌ (0)లను మదుషంక ఒకే ఓవర్లో పెవిలియన్‌ చేర్చడంతో కంగారూ శిబిరం ఆత్మరక్షణలో పడినట్లయింది. అయితే మరో ఓపెనర్‌ మార్‌‡్ష, లబుõÙన్‌ (60 బంతుల్లో 40; 2 ఫోర్లు) కుదురుగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ధాటిగా ఆడిన మార్‌‡్ష అర్ధసెంచరీ పూర్తయ్యాక రనౌట్‌ కాగా... తర్వాత వచి్చన ఇంగ్లిస్, లబుõÙన్‌ గట్టెక్కించే భాగస్వామ్యం నమోదు చేశారు. నాలుగో వికెట్‌కు 77 పరుగులు జతయ్యాక లబుõÙన్‌ పెవిలియన్‌ చేరాడు. ఫిఫ్టీ అనంతరం జట్టు విజయానికి చేరువ చేసి ఇంగ్లిస్‌ నిష్క్రమించాడు. మ్యాక్స్‌వెల్‌ (21 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టొయినిస్‌ (10 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడి ముగించారు.   

స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసాంక (సి) వార్నర్‌ (బి) కమిన్స్‌ 61; కుశాల్‌ పెరీరా (బి) కమిన్స్‌ 78; మెండిస్‌ (సి) వార్నర్‌ (బి) జంపా 9; సమరవిక్రమ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 8; అసలంక (సి) లబుషేన్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 25; ధనంజయ (బి) స్టార్క్‌ 7; వెలలాగె (రనౌట్‌) 2; కరుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 2; తీక్షణ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 0; లహిరు (బి) స్టార్క్‌ 4; మదుషంక (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (43.3 ఓవర్లలో ఆలౌట్‌) 209.
వికెట్ల పతనం: 1–125, 2–157, 3–165, 4–166, 5–178, 6–184, 7–196, 8–199, 9–204, 10–209.
బౌలింగ్‌: స్టార్క్‌ 10–0–43–2, హాజల్‌వుడ్‌ 7–1–36–0, కమిన్స్‌ 7–0–32–2, మ్యాక్స్‌వెల్‌ 9.3–0–36–1, జంపా 8–1–47–4, స్టొయినిస్‌ 2–0–11–0.

ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌: మార్‌‡్ష (రనౌట్‌) 52; వార్నర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 11; స్మిత్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 0; లబుషేన్‌ (సి) కరుణరత్నే (బి) మదుషంక 40; ఇంగ్లిస్‌ (సి) తీక్షణ (బి) వెలలాగె 58; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 31; స్టొయినిస్‌ (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (35.2 ఓవర్లలో 5 వికెట్లకు) 215.
వికెట్ల పతనం: 1–24, 2–24, 3–81, 4–158, 5–192.
బౌలింగ్‌: లహిరు 4–0–47–0, మదుషంక 9–2–38–3, తీక్షణ 7–0–49–0, వెలలాగె 9.2–0–53–1, కరుణరత్నే 3–0–15–0, ధనంజయ 3–0–13–0.

ఈదురు గాలులతో వర్షం, ఊడిపడిన హోర్డింగ్స్‌
బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. గాలి బలంగా వీయడంతో స్టేడియంలోని కొన్నిచోట్ల హోర్డింగులన్నీ ఊడిపడ్డాయి. అదృష్టవశాత్తు ప్రేక్షకుల హాజరు పలుచగా ఉండటం... ఊడిపడిన చోట జనం లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. 

చదవండి: SMT 2023: నిరాశపరిచిన సంజూ శాంసన్‌.. కేరళ ఘన విజయం

మరిన్ని వార్తలు