'చిన్ననాటి జ్ఞాపకాలు.. మా నాన్న షెడ్‌లో దొరికాయి'

23 Dec, 2021 16:50 IST|Sakshi

ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఆరోన్‌ ఫించ్‌ పెద్దగా సక్సెస్‌ అయినట్లు అనిపించడం లేదు. అతను కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆసీస్‌ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విజయం సాధించిందే తప్ప ఐసీసీ ట్రోఫీలు గెలిచిన దాఖలాలు లేవు. ఫించ్‌ కెప్టెన్సీలో 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్‌ వరకు వెళ్లింది. అయితే ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌ను మాత్రం ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.ఈ టోర్నీలో బ్యాట్స్‌మన్‌గా ఫించ్‌ విఫలమైనప్పటికి.. కెప్టెన్సీలో అదరగొట్టాడు. అలా తన కెప్టెన్సీలో ఆస్ట్రేలియాకు తొలిసారి ఐసీసీ ట్రోఫీని అందించాడు.ఇక ఆస్ట్రేలియా ఆఖరిసారిగా 2015లో మైకెల్‌ క్లార్క్‌ కెప్టెన్సీలో వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది. 

చదవండి: మ్యాచ్‌ చివరి బంతికి ఊహించని ట్విస్ట్‌

ఇక తాజాగా ఆరోన్‌ ఫించ్‌ ఒక త్రోబ్యాక్‌ ఫోటోను షేర్‌ చేశాడు. ఆ ఫోటోలో ఫించ్‌ చిన్నతనంలో తాను వాడిన క్రికెట్‌ బ్యాట్‌లు ఉన్నాయి. నా చిన్నతనంలో నేను వాడిన బ్యాట్స్‌ అవి. ఇప్పుడు మా నాన్న షెడ్‌లో దొరికాయి.. ఇందులో మీ ఫెవరెట్‌ బ్యాట్‌ ఏదో చెప్పండి అంటూ కామెంట్‌ చేశాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా  యాషెస్‌ సిరీస్‌లో బిజీగా ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పూర్తి ఆధిపత్యం చూపించిన ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో ఉంది. కాగా మూడోటెస్టు డిసెంబర్‌ 26న బాక్సింగ్‌ డే రోజున మొదలవ్వనుంది.

చదవండి: పాకిస్తాన్‌ క్రికెటర్లకు ఘోర అవమానం.. హోటల్‌ నుంచి గెంటేశారు

మరిన్ని వార్తలు