Sania Mirza: ఆస్ట్రేలియా ఓపెన్‌.. సానియా జంట ముందడుగు

24 Jan, 2022 10:02 IST|Sakshi

క్వార్టర్స్‌లో సానియా జంట

Australia Open- Sania Mirza: ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సానియా మీర్జా (భారత్‌)–రాజీవ్‌ రామ్‌ (అమెరికా) జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండో రౌండ్‌ మ్యాచ్‌లో సానియా–రాజీవ్‌ ద్వయం 7–6 (8/6), 6–4తో ఎలెన్‌ పెరెజ్‌–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జోడీపై గెలిచింది. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–రాజీవ్‌ రామ్‌ ద్వయం ఐదు ఏస్‌లు సంధించి తమ ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. 

సాకారి, బదోసా అవుట్‌ 
మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ఐదో సీడ్‌ మరియా సాకరి (గ్రీస్‌), ఎనిమిదో సీడ్‌ పౌలా బదోసా (స్పెయిన్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించారు. మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 6–3, 6–1తో బదోసా ను ఓడించగా... 21వ సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా) 7–6 (7/0), 6–3తో సాకరిపై గెలిచింది.

ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–4, 6–3తో అమండా అనిసిమోవా (అమెరికా)పై, నాలుగో సీడ్‌ క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–2, 6–2తో మాజీ నంబర్‌వన్‌ అజరెంకా (బెలారస్‌)పై విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

చదవండి: Australia Open: నాదల్‌ దూకుడు.. మూడో సీడ్‌ జ్వెరెవ్‌కు షాక్‌

మరిన్ని వార్తలు