నిబంధనలు పాటించకుంటే నో ఎంట్రీ

12 Aug, 2020 15:07 IST|Sakshi

కాన్‌బెర్రా: కోవిడ్‌ ఐసోలేషన్‌ నిబంధనలు ఉల్లంఘించిన మరో ఆస్ట్రేలియా ఆటగాడిపై చర్యలు తప్పలేదు. ఆటగాళ్ల రక్షణకు ఏర్పాటు చేసిన బయో సెక్యురిటీ బబుల్‌ నుంచి బయటకు వెళ్లిన బ్రిస్బేన్‌ బ్రోన్‌కాస్‌ ఫార్వార్డ్‌ ఆటగాడు తెవిట పంగై జూనియర్‌కు 30 వేల ఆస్ట్రేలియా డాలర్ల జరిమానా విధిస్తూ నేషనల్‌ రగ్బీ లీగ్‌ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు అతిక్రమించిన పంగైని ఇప్పుడుడప్పుడే బయో సెక్యూర్‌ ప్రాంతంతోకి అనుమతించబోమని ఎన్‌ఆర్‌ఎల్‌ చీఫ్‌ అబ్డో వెల్లడించారు. నిర్ణీత సమయం, ప్రొటోకాల్స్‌ అనంతరమే లోపలికి వచ్చేందుకు అతనికి ఎంట్రీ ఉటుందని స్పష్టం చేశారు. కరోనా క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో కట్టుదిట్టమైన రక్షణ చర్యల మధ్య నేషనల్‌ రగ్బీ లీగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

కాగా, ఆగస్టు 1 న 10 మంది రగ్బీ ఆటగాళ్లు పబ్‌కు వెళ్లారని, వారిలో పంగై ఉన్నట్టు తెలిసిందని అబ్డో చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరగుతోందని తెలిపారు. ఇక ఇప్పటికే బయో సెక్యూర్‌ నుంచి బయటికి వెళ్లిన ఏడుసార్లు జాతీయ రగ్బీ ప్రీమియర్ షిప్ పొందిన జట్లకు కోచ్‌ వేన్ బెన్నెట్‌పై కూడా చర్యలు తప్పలేదు. ఆయనను బలవంతంగా 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని నేషనల్‌ రగ్బీ లీగ్‌ స్పష్టం చేసింది. దీంతోపాటు ఆస్ట్రేలియా ఫుట్‌బాల్‌ లీగ్‌ కోచ్‌ నాథన్‌ బక్లే, అతని సహాయకుడు బ్రెంటన్ సాండర్సన్‌పై ఆస్ట్రేలియా ఫుట్‌బాల్‌ లీగ్‌ 25,000 ఆస్ట్రేలియన్ డాలర్లు చొప్పున జరిమాన విధించింది. మరోవైపు కఠినమైన నిబంధనల కారణంగా జైళ్లో బంధించిన ఫీలింగ్‌ కలుగుతోందని ఆటగాళ్లు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు