వంకర మనుషులున్నారు.. నా వల్ల కాదు

11 Jun, 2021 21:04 IST|Sakshi

అడిలైడ్:​ ఆస్ట్రేలియన్​ స్విమ్మర్​, 2016 ఒలంపిక్స్​లో రెండు పతకాల్ని సాధించిన మేడ్​లైన్​ గ్రోవ్స్​ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఒలంపిక్స్​ ట్రయల్స్​ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించింది. ఈ ఆటలో ఆడవాళ్లపై ద్వేషాన్ని వెల్లగక్కే వాళ్లున్నారని, వంకరబుద్ధితో చూస్తారని, వాళ్ల బూట్లు నాకేవాళ్లు కూడా కొందరు ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

అయితే 26 ఏళ్ల మేడ్​లైన్​ గ్రోవ్స్​ ఈ తరహా ఆరోపణలు చేయడం కొత్తేం కాదు. గతంలో స్విమ్మింగ్​ పూల్ బాయ్​ ఒకడు తనను తేడాగా చూశాడంటూ ఒక పోస్ట్ చేసిన ఆమె.. పోయినేడాది డిసెంబర్​లో ఓ కోచ్​ తనపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశాడని స్విమ్మింగ్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు కూడా చేసింది.   కాగా, ఈ స్విమ్మింగ్ సంచలనం ఈ తరహా ఆరోపణలు చేయడంపై స్విమ్మింగ్​ దిగ్గజాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇదిలా ఉంటే ఆ ఆరోపణలను గవర్నింగ్ బాడీ పరిశీలిస్తుందని, ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని స్విమ్మింగ్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ కెయిరెన్​ పర్కిన్స్​ వెల్లడించారు.

మరోవైపు గ్రోవ్స్(ముద్దుపేరు మ్యాడ్ డాగ్​) తన ఆరోపణల గురించి పూర్తి స్థాయిలో వివరించకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా తన ఆవేశాన్ని వెల్లగక్కుతోంది. దాదాపు ఏడాది వాయిదా తర్వాత జులై 23 నుంచి టోక్యోలో సమ్మర్ ఒలంపిక్స్​‌‌-2020(2021) ఒలంపిక్స్​ నిర్వహించాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా దేశం ఒలంపిక్స్​లో స్విమ్మింగ్ విభాగంలో మెడల్స్​ కొల్లగొడుతుంటుంది. ఈ తరుణంలో ట్రయల్స్​లో గ్రోవ్స్​ గనుక పాల్గొనపోతే.. ఆమెను ఒలంపిక్స్​ను ఎంపిక చేయడం కష్టం కావడమే కాదు.. మెడల్స్​ మిస్​ అయ్యే ఛాన్స్​ ఉందని స్విమ్మింగ్ ఆస్ట్రేలియా భావిస్తోంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు