క్రికెట్‌ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. లాభపడిన కివీస్‌

2 Feb, 2021 16:42 IST|Sakshi

సిడ్నీ: ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా మంగళవారం ప్రకటించింది. దక్షిణాఫ్రికాలో కరోనా సెకండ్‌వేవ్‌ ఉదృతంగా ఉన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా ఆసీస్‌ దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకోవడంతో న్యూజిలాండ్‌ జట్టు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ఒకవైపు జనవరి చివరివారంలోనే దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో ఉంచుకొని క్రికెట్‌ ఆస్ట్రేలియా టిమ్‌ పైన్‌ నేతృత్వంలోని 19 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసింది. ఇదే విషయమై ట్విటర్‌లో స్పందిస్తూ లేఖను విడుదల చేసింది. చదవండి: కోచ్‌గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా?

'కరోనా కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. సెకండ్‌ వేవ్‌ ఉదృతంగా ఉన్న కారణంతో అక్కడ ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం పట్లు ఇప్పటికే క్రికెట్‌ సౌతాఫ్రికాను క్షమాపణ కోరాం. ఈ సిరీస్‌ను తొందరలోనే నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకుంటాం. ఈ సిరీస్‌ వాయిదాతో జూన్‌లో జరగబోయే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు క్లిషంగా మారాయి. అయితే మా ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకకొని ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 'అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: మంచి వాళ్లకు మంచే జరుగుతుంది

ఇక జూన్‌లో జరగనున్న వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా కివీస్‌ నిలిచింది. ఐసీసీ ఇటీవలే ప్రకటించిన ర్యాంకింగ్స్‌ ప్రకారం కేన్‌ విలియమ్సన్‌ నేతృత్వంలోని న్యూజిలాండ్‌ జట్టు 118 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. అదే రేటింగ్‌ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉన్నా.. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల వ్యత్యాసం ఉంది. ఇక 113 రేటింగ్‌ పాయింట్లతో ఆసీస్‌ మూడోస్థానంలో, 108 రేటింగ్‌ పాయింట్లతో ఇంగ్లండ్‌ నాలుగోస్థానంలో ఉన్నాయి. కాగా జూన్‌లో లార్డ్స్‌ వేదికగా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

మరిన్ని వార్తలు