‘పుజారా.. ఈసారి అంత ఈజీ కాదు’

17 Nov, 2020 12:26 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఈసారి ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు చతేశ్వర్‌ పుజారాకు సవాల్‌ తప్పదని అంటున్నాడు ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌. గతంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్‌ జట్టు టెస్టు సిరీస్‌నుకైవసం​ చేసుకుని చరిత్ర సృష్టంచగా అందులో పుజారా ప్రధాన భూమిక పోషించాడు. కాగా, ఇప్పుడు మాత్రం పుజారాకు తమ బౌలర్లు ఆ చాన్స్‌ ఇవ్వరని మెక్‌గ్రాత్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఒక స్పోర్ట్స్‌ చానల్‌తో మాట్లాడిన మెక్‌గ్రాత్‌.. ‘పుజారా టీమిండియా బ్యాటింగ్‌లో కీలక ఆటగాడు. నిలకడైన బ్యాటింగ్‌తో క్రీజ్‌లో పాతుకుపోతాడు. పరుగులు చేయనప్పుడు ఒత్తిడిని అనుభవించడు. ఆధునిక యుగంలో ఇది ప్రత్యేకమైనది, ఇక్కడ ఒక తొలి ఓవర్ తర్వాత పరుగులు చేయాలనుకునే బ్యాట్స్ మెన్ ఉన్నారు. పుజారాకు ఆ మనస్తత్వం లేదు. (ఇక్కడ చదవండిచరిత్రను రిపీట్‌ చేస్తాం: పుజారా)

ఇది చివరిసారి అతనికి సహాయపడింది అని మెక్‌గ్రాత్ అన్నాడు. అతను ఈ మధ్య కాలంలో క్రికెట్ ప్రాక్టీస్ చేయలేదు, ఇది పెద్ద ప్రభావాన్ని చూపబోతుంది. అతను ఏ క్రికెట్ ఆడలేదు కాబట్టి అతను చివరి సిరీస్ కంటే కష్టపడాల్సి ఉంటుంది.ఈసారి పుజారాకు అతి పెద్ద చాలెంజ్‌ తప్పదు’ అని అన్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో పుజారా , 521 పరుగులతో మొత్తం 74.42 సగటుతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్వదేశానికి తిరిగి రావడం కూడా ఆసీస్‌కు కలిసి వస్తుందని మెక్‌గ్రాత్‌ అభిప్రాయపడ్డాడు. కోహ్లి జట్టులో లేకపోతే అది కచ్చితంగా సిరీస్‌పై ప్రభావం చూపిస్తుందన్నాడు.

>
మరిన్ని వార్తలు