Shane Warne: మద్యం, మాంసం, సిగరెట్లతో స్పిన్ మాంత్రికుడికి నివాళి

5 Mar, 2022 20:04 IST|Sakshi

స్పిన్‌ మాంత్రికుడు, ఆసీస్ దిగ్గజ బౌలర్‌ షేన్ వార్న్(51) శుక్రవారం థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలియగానే మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం ముందు ఏర్పాటు చేసిన అతని కాంస్య విగ్రహం వద్దకు బారులు తీరిన అభిమానులు స్పిన్ మాంత్రికుడికి ప్రత్యేకంగా నివాళులర్పిస్తున్నారు. 


రకరకాల పూలతో పాటు తమ ఆరాధ్య క్రికెటర్‌కు ఎంతో ప్రీతిపాత్రమైన మద్యం (బీర్‌), మాంసం, సిగరెట్లను విగ్రహం ముందు ఉంచి అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా చనిపోతే వారికి ఇష్టమైన వాటిని సమాధి ముందుంచడం ఆనవాయితీ. ఈ క్రమంలో వార్న్‌కు ఇష్టమైన బీర్‌ను, మాంసాన్ని, సిగరెట్లను అభిమానులు అతని విగ్రహం ముందుంచుతున్నారు. 


కాగా, క్రికెటింగ్‌ కెరీర్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వార్నీ.. వ్యసనాలకు బానిసై వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచిన విషయం తెలిసిందే. మద్యం, సిగరెట్లతో పాటు స్త్రీ వ్యామోహం కూడా అధికంగా కలిగిన అతను.. చాలా సందర్బాల్లో వీటిని సేవిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వార్న్‌.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. సమకాలీన క్రికెట్‌లో లంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ (1347) తర్వాత వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 
చదవండి: Shane Warne: దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ హఠాన్మరణం

మరిన్ని వార్తలు