ఆసీస్‌ జట్టులో విభేదాలు.. కారణం అతనే!

30 Jan, 2021 19:20 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆసీస్‌ జట్టులో విభేదాలు ఉన్నాయని.. దానికి  కారణం ఆ జట్టు ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అని సిడ్నీ హెరాల్డ్‌ ప్రతిక  పేర్కొంది. కోచ్‌ వ్యవహారశైలితో ఆటగాళ్లు ఇబ్బందులకు గురవుతున్నారని.. దీంతో పాటు పలువురు సీనియర్‌ ఆటగాళ్లు లాంగర్‌ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లుగా రాసుకొచ్చింది. ఈ విషయం తన దృష్టికి రావడంతో కోచ్‌ లాంగర్‌ స్పందించాడు.

'ఆటగాళ్లతో విభేదాలు ఉన్నాయన్న వార్తల్లో నిజం లేదు. అయినా ఇందులో నిజమెంతనేది నేను పట్టించుకోను. ఆటగాళ్లు తమ తిండి విషయాల్లో ఒకరు కావాలనుకుంటే నా పని నేను చేసినట్లు కాదు. ఇటీవలే టీమిండియాతో జరిగిన గబ్బా టెస్టులో మా ఆటగాడు సాండ్‌విచ్‌ తినడానికి మైదానంలోకి తీసుకువచ్చాడు.  గత అనుభవాల దృష్యా ఆసీస్‌ ఆటగాళ్లపై నిరంతరం నిఘా ఉందని.. జేబులో ఏదైనా తీసుకెళ్తే అది ప్రమాదంగా మారే అవకాశం ఉందని.. తీసుకురావద్దని అతనికి చెప్పా. దీనిని కూడా తప్పే అంటే ఇంకేం చేయలేను.చదవండి: దుమ్మురేపిన పుజారా.. కోహ్లి మాత్రం అక్కడే

ఇక బౌలింగ్‌ వ్యవహారాల్లో తలదూర్చకపోవడానికి కారణం ఉంది. బౌలింగ్‌ కోచ్‌ ఉన్నప్పుడు అతనే బౌలర్లను పర్యవేక్షిస్తాడు. పైగా నేనెప్పుడు బౌలర్ల సమావేశానికి హాజరుకాను.. కానీ కొన్ని నెలలుగా వాటిలో కూడా మార్పులు చోటుచేసుకోవడంతో దానిపై దృష్టి పెట్టాల్సి వచ్చిందంటూ' చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పటికే టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆసీస్‌ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా కోచ్‌ లాంగర్‌ వివాదం ఎక్కడికి తీసుకెళుతుందో వేచి చూడాలి.
చదవండి: ఐపీఎల్‌లో‌ ఆడేందుకు నేను సిద్ధం

మరిన్ని వార్తలు