Australian Open 2022: యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఎమ్మా రాడుకానుకు దిమ్మతిరిగే షాక్‌

20 Jan, 2022 17:19 IST|Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో పెను సంచలనం నమోదైంది. యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌.. బ్రిటీష్‌ టీనేజర్‌ ఎమ్మా రాడుకానుకు ఊహించని షాక్‌ ఎదురైంది. మోంటెనెగ్రోకు చెందిన 98వ ర్యాంకర్‌ డంకా కోవినిక్‌ చేతిలో 6-4,4-6,6-3తో ఓడిన ఎమ్మా రాడుకాను రెండోరౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. తొలి సెట్‌లో 3-0తో ఆధిక్యంలో కనిపించిన రాడుకాను ఆ తర్వాత వరుసగా ఐదు గేమ్‌లు కోల్పోయి సెట్‌ కోల్పోయింది.

చదవండి: Novak Djokovic: పోతూ పోతూ నష్టం మిగిల్చాడు.. కట్టేది ఎవరు?

సర్వీస్‌ చేసే సమయంలో కుడిచేతికి గాయం కావడంతో ట్రీట్‌మెంట్‌ చేయించుకొని బరిలోకి దిగిన రాడుకాను రెండో సెట్‌ గెలిచినప్పటికి..మూడో సెట్‌లో డంకా కోవినిక్‌ ఫుంజుకొని 6-3తో ఓడించి సెట్‌ను కైవసం చేసుకుంది. ఒక ఒక మేజర్‌ గ్రాండ్‌స్లామ్‌లో కోవినిక్‌ మూడో రౌండ్‌ చేరడం ఇదే తొలిసారి. మూడో రౌండ్‌లో రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత సిమోనా హలెప్‌ లేదా బ్రెజిల్‌కు చెందిన బీట్రిజ్‌ హదాద్‌ మయీయాతో తలపడనుంది.

రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన ఆండీ ముర్రే


మరోవైపు పురుషుల సింగిల్స్‌లో బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆండీ ముర్రేకు చుక్కెదురైంది. రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన టారో డేనియల్‌ చేతిలో 6-4, 6-4,6-4 వరుస సెట్లలో ఓడి ఇంటిదారి పట్టాడు. దాదాపు 2 గంటల 48 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో అన్ని సెట్లలోనే టారో.. ముర్రేపై స్పష్టమైన ఆధిక్యం కనబరిచాడు. జొకోవిచ్‌, ఫెదరర్‌ లాంటి ఆటగాళ్లు దూరమైన వేళ ఈసారి టైటిల్‌ ఫెవరెట్‌గా భావించిన ముర్రే రెండోరౌండ్‌లోనే ఇంటిదారి పట్టడం ఆసక్తి కలిగించింది.

>
మరిన్ని వార్తలు