Austrian Grand Prix: లెక్‌లెర్క్‌ ఖాతాలో మూడో విజయం

11 Jul, 2022 06:32 IST|Sakshi

ఫెరారీ జట్టు డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో మూడో విజయం నమోదు చేశాడు. స్పీల్‌బర్గ్‌లో ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో లెక్‌లెర్క్‌ చాంపియన్‌గా నిలిచాడు.

నిర్ణీత 71 ల్యాప్‌లను లెక్‌లెర్క్‌ అందరికంటే వేగంగా గంటా 24 నిమిషాల 24.312 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానంలో, హామిల్టన్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రెంచ్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది.

మరిన్ని వార్తలు