Ind Vs HK: 'నీ బౌలింగ్‌కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కోహ్లి బెటర్‌'

1 Sep, 2022 13:00 IST|Sakshi

Asia Cup 2022 India Vs Hong Kong: ఆసియా కప్‌-2022లో భాగంగా హాంగ్‌ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పేసర్‌  అవేశ్ ఖాన్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క వికెట్‌ పడగొట్టి ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో అవేశ్ ఖాన్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. "నీ బౌలింగ్‌కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కోహ్లి బెటర్‌" అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఆసియాకప్‌కు ప్రకటించిన భారత జట్టులో ముగ్గురు పేసర్లు మాత్రమే ఉన్నారు. కాబట్టి అవేశ్ ఖాన్‌కు ప్రత్నామ్యాయంగా మరో పేసర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఈ మ్యాచ్‌కు పార్ట్‌టైమ్‌ పేసర్‌ హార్దిక్‌ పాండ్యాకు విశ్రాంతిని ఇవ్వడంతో  అవేశ్ ఖాన్‌ తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాండ్యాతో నాలుగు ఓవర్లు వేయించిన రోహిత్‌.. అవేష్‌కు కేవలం రెండు ఓవర్లు మాత్రమే ఇ‍చ్చాడు.

భారత్‌ తదుపరి మ్యాచ్‌కు హార్ధిక్‌ జట్టులోకి వస్తే.. అవేష్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కేవలం ఒక ఓవర్‌ మాత్రమే బౌలింగ్‌ చేసిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆవేశ్‌ ఖాన్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ నడుస్తోంది. మీమ్స్‌తో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. 

హాంగ్‌ కాంగ్‌ను చిత్తు చేసిన భారత్‌
ఈ మ్యాచ్‌లో హాంగ్‌ కాంగ్‌పై టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్ 26 బంతుల్లోనే 68 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించగా.. కింగ్‌ కోహ్లి 59 పరుగులతో రాణించాడు.

అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి హాంగ్‌ కాంగ్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో జడేజా, అర్ష్‌దీప్‌ సింగ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అవేష్ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు.


చదవండి: Ind Vs HK: కోహ్లికి హాంగ్‌ కాంగ్‌ జట్టు స్పెషల్‌ గిఫ్ట్‌.. థాంక్యూ విరాట్‌ అంటూ! ఫిదా అయిన ‘కింగ్‌’!
Asia Cup 2022 Ind Vs HK: ఆరేళ్ల తర్వాత కింగ్‌ కోహ్లి బౌలింగ్‌.. అభిమానులు ఫిదా

మరిన్ని వార్తలు