Avesh Khan: వారెవ్వా ఏం స్పీడు భయ్యా.. బ్యాట్‌ రెండు ముక్కలయ్యింది

9 Jun, 2022 22:21 IST|Sakshi

సౌతాఫ్రికా, భారత్‌ల మధ్య జరిగిన తొలి టి20లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ సమయంలో ఆవేశ్‌ ఖాన్‌ వేసిన ఒక బంతి బ్యాట్‌ను రెండు ముక్కలు చేసింది. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో మూడో బంతిని ఆఫ్‌సైడ్‌ దిశగా యార్కర్‌ వేశాడు. క్రీజులో ఉన్న డుసెన్‌ బంతిని టచ్‌ చేసే ప్రయత్నం చేశాడు. అంతే మిడిల్‌లో తాకిన బంతి బ్యాట్‌ను రెండు ముక్కలుగా చీల్చుకుంటూ వెళ్లింది. ఇది చూసిన డుసెన్‌ తన బ్యాట్‌ను పరిశీలించగా.. ఆవేశ్‌ఖాన్‌ సహా టీమిండియా ఆటగాళ్లు నవ్వుకున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు భారీ స్కోరు చేసింది. ఇషాన్‌ కిషన్‌ 76 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. శ్రేయాస్‌ అయ్యర్‌ 36, రిషబ్‌ పంత్‌ 29 పరుగులు చేశారు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌, నోర్ట్జే, పార్నెల్‌, ప్రిటోరియస్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

చదవండి: Rishabh Pant: టి20 కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ అరుదైన రికార్డు

మరిన్ని వార్తలు