Avishka Gunawardene: అఫ్గనిస్తాన్‌ కోచ్‌గా అవిష్క గుణవర్ధనే 

18 Aug, 2021 07:44 IST|Sakshi

కాబుల్‌: తాలిబాన్ల సమస్యతో అట్టుడుకుతున్న తమ దేశంలో అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కొత్త నిర్ణయం తీసుకుంది. తమ జాతీయ జట్టు కోచ్‌గా శ్రీలంక మాజీ ఆటగాడు అవిష్క గుణవర్ధనేను నియమించింది. గుణవర్ధనే శ్రీలంక జట్టు తరఫున 6 టెస్టులు, 61 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. టి10 టోర్నీ సందర్భంగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న గుణవర్ధనేను ఐసీసీ గత మే నెలలోనే నిర్దోషిగా ప్రకటించింది. 

మరిన్ని వార్తలు