ఐపీఎల్‌ 2020... తస్మాత్ జాగ్రత్త!

6 Oct, 2020 16:32 IST|Sakshi

ఢిల్లీ: క్రికెట్‌ అభిమానులు పండగలా భావించే ఐపీఎల్‌ ప్రారంభమైతే జాగ్రత్త పడడం ఏంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు.. ఐపీఎల్‌ మ్యాచ్‌లో జరిగే కొన్ని సన్నివేశాలను ఉదాహరణగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడేలా సైబరాబాద్‌ పోలీసులు ఆలోచించారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్‌ రన్‌ఔట్‌ను ఉదాహరణగా తీసుకొని ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేలా సోషల్‌ మీడియా ఫొటోను షేర్‌ చేశారు. 


చెన్నై, హైదరాబాద్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని పరుగులు తీయలేక అలసిపోయిన ఫొటోను షేర్‌ చేశారు. 

నాగ్‌పూర్‌ సిటీ పోలీసులు కూడా ఇలాంటిదే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. బ్యాంకు ఉద్యోగుల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కోల్‌కతా జట్టుకు చెందిన ఆటగాడు వరున్‌ చక్రవర్తి ఫొటోను ఉపయోగించారు. బ్యాంకు ఉద్యోగుల పేరుతో మోసాలు చేస్తున్నారని... మీ ఓటీపీ, ఏటీమ్‌ పిన్‌ నెంబర్లను ఎవ్వరితో షేర్‌ చేసుకోకూడదని పోస్ట్‌ చేశారు. 

ఇలా ఐపీఎల్‌ చూసేవారికి కనువిందుతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. 

(ఇదీ చదవండి: వైరల్‌: ధోని వయసును విమర్శిస్తూ ఇర్ఫాన్‌ ట్వీట్‌)

మరిన్ని వార్తలు