ఎన్ని అర్హతలున్నా ఏం లాభం.. అతనుండగా జట్టులోకి కష్టమే

27 May, 2021 20:50 IST|Sakshi

ముంబై: తుది జట్టులో ఉండడానికి ఎన్ని అర్హతలున్నా ఏ ప్రయోజనం లేదని టీమిండియా యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశాడు. జట్టులో రవీంద్ర జడేజా లాంటి అత్యుత్తమ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అల్ రౌండర్ ఉండగా, తనకు తుది జట్టులో స్థానం లభిస్తుందని అనుకోవట్లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్న అక్షర్ పటేల్.. ఓ ఇంటర్వ్యూ సందర్బంగా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

తనలో టాలెంట్ కు ఏ కొదవ లేదని, జట్టు ప్రయోజనాల కోసం ప్రతి ఒక్క ఆటగాడు పాటు పడాల్సి ఉంటుందని అక్షర్ చెప్పుకొచ్చాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో అత్యద్భుతంగా రాణించి, 27 వికెట్లు పడగొట్టిన ఈ లెఫ్ట్ అర్మ్  స్పిన్ అల్ రౌండర్.. ఇంగ్లండ్ పర్యటనలో తన అవకాశాలపై స్పందిస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా, గాయం కారణంగా జడేజా అందుబాటులో లేకపోవడం వల్ల ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా అక్షర్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ లో అతను 3 మ్యాచ్ ల్లో 10.59 సగటుతో 27 వికెట్లు పడగొట్టి అరంగేట్రం సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. 

ఈ సిరీస్ లో అక్షర్ ఏకంగా నాలుగు సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ‘నైపుణ్యాల పరంగా వెనుకబడలేదు. కాగా, టెస్టుల్లో జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ ద్వయం ఇంటా, బయటా అద్భుత ప్రదర్శనలు చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌కు చోటు దొరకడం చాలా కష్టం. కుల్‌దీప్‌, చహల్‌ లాంటి స్పిన్నర్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణిస్తున్నా, జట్టు కూర్పు కారణంగా వారికి కూడా చోటు దొరకడం లేదు.
చదవండి: WTC Final: ఒక్కో టికెట్ ధర 2 లక్షలు..?

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు