Axar Patel: వారెవ్వా అక్షర్‌ పటేల్‌.. టెస్టు క్రికెట్‌ చరిత్రలో మూడో బౌలర్‌గా

27 Nov, 2021 16:53 IST|Sakshi

Axar Patel Was 3rd  Bowler In Test Cricket history.. టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో తన సూపర్‌ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అక్షర్‌ పటేల్‌ 34 ఓవర్లు వేసి 6 మెయిడెన్లు సహా 62 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టామ్‌ లాథమ్‌, రాస్‌ టేలర్‌, హెన్రీ నికోలస్‌, టామ్‌ బ్లండర్‌, సౌథీ రూపంలో అక్షర్‌ 5 వికెట్లు తీసుకున్నాడు. అంతకముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో నాలుగుసార్లు ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.

చదవండి: Ashwin Vs Nitin Menon: అంపైర్‌తో అశ్విన్‌ గొడవ.. అది మనసులో పెట్టుకొనేనా?

► కాగా అక్షర్‌ టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది ఐదోసారి. తొలి నాలుగు టెస్టుల్లో ఎక్కువసార్లు ఐదు వికెట్లు తీసిన జాబితాలో టామ్‌ రిచర్డ్‌సన్‌, రోడ్ని హగ్‌తో కలిసి అక్షర్‌ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఉన్న చార్లి టర్నర్‌ తొలి నాలుగు టెస్టుల్లో ఆరు సార్లు ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఇక వెర్నన్‌ ఫిలాండర్‌, ఫ్రెడ్‌ స్పోపోర్త్, సిడ్‌ బార్నెస్‌, నిక్‌ కుక్‌లు నాలుగేసి సార్లు ఐదు వికెట్ల మార్క్‌ సాధించారు. 

► ఇంకో విశేషమేమిటంటే డెబ్యూ టెస్టు నుంచి తాను ఆడిన నాలుగు టెస్టుల్లో అక్షర్‌ ప్రతీ టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇంతకముందు ఇద్దరు మాత్రమే ఈ ఘనత సాధించారు. చార్లీ టర్నర్‌ (1887లో డెబ్యూ నుంచి తొలి నాలుగు టెస్టులు), టామ్‌ రిచర్డ్‌సన్‌(1893 డెబ్యూ నుంచి తొలి నాలుగు టెస్టులు) ఉన్నారు. తాజాగా అక్షర్‌ పటేల్‌ వీరి సరసన నిలిచాడు.

చదవండి: Tom Latham Stump Out: రెండో బ్యాట్స్‌మన్‌గా టామ్‌ లాథమ్! 30 ఏళ్ల తర్వాత..

► ఇక టీమిండియా తరపున అక్షర్‌ పటేల్‌ కంటే ముందు ఎల్‌. శివరామకృష్ణన్‌, నరేంద్ర హిర్వాణిలు తొలి నాలుగు టెస్టుల్లో మూడేసి సార్లు ఐదు వికెట్ల మార్క్‌ను సాధించారు. కాగా ఈ విషయంలో మాత్రం అక్షర్‌ పటేల్‌ టీమిండియా తరపున తొలి స్థానంలో నిలిచాడు.

మరిన్ని వార్తలు