‘ఫ్యాబ్‌-4 బ్యాటింగ్‌ లిస్టులోకి వచ్చేశాడు’

6 Aug, 2020 15:09 IST|Sakshi

స్మిత్‌ తరహాలో చెలరేగిపోవడం ఖాయం

అజామ్‌పై వాన్‌ ప్రశంసలు

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు తొలి రోజు ఆటలోనే పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ బాబర్‌ అజామ్‌ మెరవడంతో అతనిపై ఒక్కసారిగా ఫోకస్‌ ఎక్కువైంది. తొలి రోజు ఆటలో అజామ్‌ 100 బంతుల్లో 11 ఫోర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే అజామ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్లు నాసీర్‌ హుస్సేన్‌, మైకేల్‌ వాన్‌లు అజామ్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. మైకేల్‌ వాన్‌ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్‌లో అజామ్‌ తనదైన ముద్రతో చెలరేగిపోతూ స్టీవ్‌ స్మిత్‌, కోహ్లి, కేన్‌ విలియమ్సన్‌, జోరూట్‌లను మైమరిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే మనం ఎక్కువగా మాట్లాడుకునే ఫ్యాబ్‌-4 బ్యాటింగ్‌లో లిస్టులో రూట్‌ స్థానాన్ని అజామ్‌ ఆక్రమించాడన్నాడు.  ప్రధానంగా గత 18నెలల్లో అజామ్‌ కంటే ఎక్కువ యావరేజ్‌ నమోదు చేసిన క్రికెటర్లు లేకపోవడమే అతని ఆట మెరుగవ్వడాన్ని చూపెడుతుందన్నాడు. ప్రస్తుతం టెస్టు యావరేజ్‌లో అజామ్‌ 46కుపైగా యావరేజ్‌ కల్గి ఉండగా, గత 18 నెలల్లో అతని యావరేజ్‌65పైగా ఉంది. దీన్నే వాన్‌ ప్రస్తావిస్తూ.. ఇక ప్యాబ్‌-4 బ్యాటింగ్‌ లిస్టులో అజామ్‌ చేరిపోయాడన్నాడు. (పాకిస్తాన్‌ 139/2)

మరొకవైపు ఇంగ్లండ్‌కు అజామ్‌ నుంచి ప్రమాదం పొంచి ఉందన్నాడు. గతేడాది యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ ఏవిధంగా ఇంగ్లండ్‌పై చెలరేగిపోయాడో, అదే విధంగా ఇప్పుడు అజామ్‌ చుక్కలు చూపించడం ఖాయమన్నాడు. స్మిత్‌ ఆట అజామ్‌లో చూస్తున్నానంటూ వాన్‌ కొనియాడాడు.  ఇప్పటివరకూ ఫ్యాబ్‌-4 జాబితాలో కోహ్లి, కేన్‌ విలియమ్సన్‌, స్మిత్‌, జో రూట్‌లు ఉండగా, ఇక రూట్‌ స్థానాన్ని అజామ్‌ ఆక్రమించాడన్నాడు.  ఇక నిన్నటి ఆటలో జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో పుల్‌ షాట్‌ కొట్టడంలో విఫలమైన అజామ్‌.. ఈరోజు ఆ షాట్‌ను ఆడటానికి దూరంగా ఉంటాడన్నాడు. (‘ధోని ఏమిటో మీరే చూస్తారు కదా’)


 

మరిన్ని వార్తలు