NZ vs PAK: పాపం బాబర్‌.. అలా ఔట్‌ అవుతానని అస్సలు ఊహించి ఉండడు!

3 Jan, 2023 17:42 IST|Sakshi

కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం దురదృష్టకర రీతిలో పెవిలియన్‌కు చేరాడు. పాక్‌ ఓపెనర్‌ ఇమామ్ ఉల్ హక్ ఇచ్చిన తప్పుడు కాల్‌ వల్ల బాబర్‌ అనవసర రనౌట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో బాబర్‌ కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు.
ఏం జరిగిందంటే?
పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ 25 ఓవర్‌ వేసిన మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో ఇమామ్ ఉల్ హక్ మిడ్‌ వికెట్‌ దిశగా ఆడాడు. ఈ క్రమంలో ఇమామ్, బాబర్‌ రెండు పరుగులు పూర్తిచేసుకుని మూడో పరుగు కోసం ప్రయత్నించారు. అయితే ఇమామ్ మూడో పరుగు తీసేందుకు ముందుకు వచ్చి మళ్లీ వెనుక్కి వెళ్లిపోయాడు.

అది గమనించని బాబర్‌  ఇమామ్ ‍పిలుపు ఇవ్వడంతో స్ట్రైకర్‌ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరు బ్యాటర్లు ఒక వైపే ఉండిపోయారు. దీంతో కివీస్‌ ఫీల్డర్‌ హెన్రీ నికోల్స్ బౌలర్‌ ఎండ్‌ వైపు త్రో చేశాడు. ఈజీ రనౌట్‌ రూపంలో బాబర్‌ పెవిలియన్‌కు చేరాడు. దీంతో తీవ్ర నిరాశతో బాబర్‌ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రెండో రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌ 3 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. క్రీజులో  ఇమామ్ ఉల్ హక్(74), షకీల్‌(13) పరుగులతో ఉన్నారు.


చదవండిటీమిండియా హెడ్‌ కోచ్‌గా లక్ష్మణ్‌.. ద్రవిడ్‌కు త్వరలోనే గుడ్‌బై!

>
మరిన్ని వార్తలు