ENG Vs PAK: ప్రపం‍చ రికార్డుతో మెరిసిన బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌

23 Sep, 2022 07:54 IST|Sakshi

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టి20లో పాకిస్తాన్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌ బౌలర్లను చెడుగుడు ఆడిన బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌లు పాక్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించారు. తొలి టి20లో ఓటమికి బదులు తీర్చుకున్న పాకిస్తాన్‌ ఏడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమంగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే టి20 క్రికెట్‌లో ఈ జంట ప్రపంచ రికార్డుతో పాటు మరికొన్ని రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.

►పాకిస్తాన్‌ ఓపెనర్లు బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌లు టి20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇంగ్లండ్‌ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఈ ఇద్దరే ఉదేశారు. ఈ నేపథ్యంలో తమ పేరిటే ఉన్న పాత రికార్డును కూడా ఈ జంట బద్దలు కొట్టింది.
►203 పరుగుల భాగస్వామ్యం టీ20ల్లో పాకిస్థాన్ తరఫున అత్యధిక ఓపెనింగ్ స్టాండ్‌గా నిలవనుంది. ఇంతకముందు బాబర్‌-రిజ్వాన్‌ జోడి చేసిన 193 పరుగులు భాగస్వామ్యం ఇప్పటివరకు అత్యుత్తమంగా నిలిచింది. తాజాగా ఆ రికార్డు బద్దలైంది.
►ఇక పాకిస్తాన్‌ జట్టుకు టి20ల్లో 10 వికెట్ల తేడాతో గెలవడం ఇది రెండోసారి. ఇంతకముందు టి20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియాపై పాకిస్తాన్‌ 10 వికెట్లతో విజయం సాధించింది. 
►ఇక బాబర్‌ ఆజం- మహ్మద్‌ రిజ్వాన్‌లు నెలకొల్పిన 203 పరుగులు భాగస్వామ్యం టి20 క్రికెట్‌లో ఏదైనా వికెట్‌కు ఐదో అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది.


 

మరిన్ని వార్తలు