#BabarAzam: 'వరల్డ్‌కప్‌ ఉంది.. ప్లీజ్‌ ఇలాంటి రిస్క్‌లు వద్దు!'

25 May, 2023 14:56 IST|Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం తన కొత్త బీఎండబ్ల్యూ స్పోర్ట్స్‌బైక్‌పై లాహోర్‌ వీధుల్లో చక్కర్లు కొట్టాడు.  దీనికి సంబంధించిన వీడియోనూ బాబర్‌ ఆజం స్వయంగా ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. Ready, Set, Go.. అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఇక బాబర్‌ హెల్మెట్‌ సహా అన్ని సేఫ్టీ రూల్స్‌ పాటిస్తూ రోడ్డు మీద బైక్‌ రైడింగ్‌ చేసినప్పటికి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

కారణం.. ''మనం ఎంతమంచిగా వెళ్లినా టైం బాగాలేకపోతే ఏమైనా జరగొచ్చు'' అంటూ కామెంట్‌ చేశారు. గతేడాది టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఘోర కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన పంత్‌ కోలుకున్నప్పటికి తొమ్మిది నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇప్పటికే ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌ సహా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. వన్డే వరల్డ్‌కప్‌ ఆడేది కూడా అనుమానంగానే ఉంది.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబర్‌ ఆజం బైక్‌ రైడింగ్‌ను పాక్‌ అభిమానులు సీరియస్‌గా తీసుకున్నారు. ''అసలే ఆసియా కప్‌, వన్డే వరల్డ్‌కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలున్నాయి. ఈ సమయంలో ఇలాంటి రిస్క్‌లు వద్దు''.. మరో ఐదు నెలల్లో వరల్డ్‌కప్‌ ఉంటే ఇలాంటి రిస్క్‌లు చేస్తున్నాడు.. బాబర్‌ను వెంటనే కెప్టెన్సీ నుంచి తీసేయడం మంచిది'' అంటూ పోస్టులు పెట్టారు.

చదవండి: మే 28న తేలనున్న ఆసియాకప్‌ భవితవ్యం!

'కింగ్‌' కోహ్లి రికార్డు.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడు

మరిన్ని వార్తలు