Trolls On Babar Azam: స్కై కింద రిలాక్స్‌ అవుతున్నా.. మిస్‌ ఫైర్‌ అయిన బాబర్‌ ఆజమ్‌ ట్వీట్‌

24 Nov, 2022 19:12 IST|Sakshi

పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. హాఫ్‌ నాలెడ్జ్‌తో అతను పోస్ట్‌ చేసిన ఓ ఫోటో క్యాప్షన్‌.. అతనికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. టీ20 వరల్డ్‌కప్‌-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో పరాభావం తర్వాత.. షికార్లు కొట్టడంలో బిజీగా ఉన్న పాక్‌ కెప్టెన్‌, ఓ ఆహ్లాదకరమైన ఉదయాన నీలం రంగు (టీమిండియా జెర్సీ కలర్‌) ఆకాశం కింద ఓ ఫోటో దిగి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఇందుకు రిలాక్సింగ్‌ అండర్‌ బ్లూ స్కై అని క్యాప్షన్‌ పెట్టాడు. ఇదే క్యాప్షన్‌ మనోడి కొంపముంచింది.

అతను ఏ ఉద్దేశంతో ఈ క్యాప్షన్‌ పెట్టాడో కానీ, భారత అభిమానుల చేతుల్లో మాత్రం బలి అవుతున్నాడు. బ్లూ స్కైని టీమిండియా జెర్సీలో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌తో పోలుస్తున్న టీమిండియా ఫ్యాన్స్‌.. తాజా టీ20 ర్యాంకింగ్స్‌ను (సూర్యకుమార్‌ అగ్రస్థానంలో ఉండగా.. రిజ్వాన్‌ రెండు, బాబర్‌ ఆజమ్‌ నాలుగు స్థానాల్లో ఉన్నారు) ఉదాహరణగా తీసుకుని పాక్‌ కెప్టెన్‌ను ఓ రేంజ్‌లో ఆటాడుకుంటున్నారు.

నువ్వు చెప్పింది కరెక్టే ఆజామూ.. టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (స్కై) కిందే రిలాక్స్‌ అవుతున్నావు అంటూ ట్రోలింగ్‌కు దిగారు. ఇంత కరెక్ట్‌గా ఎలా క్యాప్షన్‌ పెట్టావు ఆజామూ.. నువ్వు నిజంగా సూర్యకుమార్‌ యాదవ్‌ నీడలోనే రిలాక్స్‌ అవుతున్నావు అంటూ ఆటపట్టిస్తున్నారు. తాను చేసిన ట్వీట్‌ మిస్‌ ఫైర్‌ కావడంతో బాబర్‌ ఆజమ్‌ నాలుక్కరుచుకుంటున్నాడు. ఇదిలా ఉంటే,నిన్న (నవంబర్‌ 23) విడుదల చేసిన లేటెస్ట్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో.. బాబర్‌ ఆజమ్‌ మూడో స్థానం నుంచి నాలుగో ప్లేస్‌కు దిగజారాడు. అతని స్థానానికి కివీస్‌ ప్లేయర్‌ డెవాన్‌ కాన్వే ఎగబాకాడు.  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు