IND vs AUS: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌!

4 Mar, 2023 10:50 IST|Sakshi

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన భారత జట్టు.. మూడో టెస్టులో మాత్రం బోల్తా పడింది. ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో ఎలాగైనా విజయం సాధించి 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది. మరోవైపు ఆఖరి టెస్టులో గెలుపొంది సిరీస్‌ను సమం చేయాలని ఆసీస్‌ ఊ‍వ్విళ్లూరుతోంది. 

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగో టెస్టుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం అతిథ్య ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌ను భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోదీ, ఆంథోనీ అల్బనీస్‌లు మైదానానికి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ప్రధానులిద్దరూ తొలి రోజు ఆటను చూసేందుకు స్టేడియంకు రానున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా తొలి రోజు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించకూడదని గుజరాత్‌ క్రికెట్‌ ఆసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే భాగంగానే తొలి రోజు టికెట్స్‌ను గుజరాత్‌ క్రికెట్‌ ఆసోసియేషన్ ఆన్‌లైన్‌లో బ్లాక్‌ చేసింది. మొదటి రోజు మినహా మిగితా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.
చదవండి: అప్పుడు గెలిచిన విషయం మర్చిపోయారా? నోరు మూసుకుని ఆటపై దృష్టి పెట్టండి.... టీమిండియాపై ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఘాటు వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు