BBL 2022: క్రికెట్‌ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

16 Dec, 2022 11:18 IST|Sakshi

బిగ్ బాష్ లీగ్-2022లో భాగంగా బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో మెల్‌బోర్న్ కెప్టెన్‌ నిక్ మాడిన్సన్(87) పరుగులతో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ ఇన్నింగ్స్‌ సమయంలో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. గాలి కారణంగా స్టంప్స్‌ పైన బెయిల్స్‌ పడితే ఔట్‌ అని మెల్‌బోర్న్ బ్యాటర్‌ పెవిలియన్‌కు వెళ్లేందుకు సిద్దమయ్యాడు. 

ఏం జరిగిందంటే..?
మెల్‌బోర్న్ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌లో మార్క్‌ స్టెకెటీ వేసిన ఒక  షార్ట్ పిచ్‌ బాల్‌ను.. మాడిన్సన్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్-లెగ్ బౌండరీ వైపు షాట్‌ ఆడాడు. ఈ షాట్‌ ఆడే క్రమంలో స్టంప్స్‌ బెయిల్స్‌ కిందపడిపోయాయి. దీంతో అతడు స్టంప్స్‌ను తన కాలితో తాకడం వల్లే బెయిల్స్‌ కిందపడిపోయాయి అని అంతా భావించారు.

మాడిన్సన్ కూడా హిట్‌ వికెట్‌ అయ్యాని భావించి డగౌట్ వైపు నడవడం ప్రారంభించాడు. ఇక్కడే అసలు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అతడి ఔట్‌పై సందేహంతో ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు. అయితే స్టంప్స్‌కు మాడిన్సన్ బ్యాట్‌ గానీ, అతడి బ్యాక్‌ఫుట్‌  గానీ తాకనట్లు రిప్లేలో సృష్టంగా కన్పించింది.

దీంతో బెయిల్స్‌ గాలికి పడి ఉంటాయిని భావించిన థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో కొద్ది నిమిషాలపాటు ఫీల్డ్‌లో గందరగోళం నెలకొంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


చదవండిIND vs BAN: ఐదు వికెట్లతో చెలరేగిన కుల్దీప్‌ .. 150 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్‌

మరిన్ని వార్తలు