సుదీర్ఘ విరామం రెజ్లర్లకు సవాలే 

15 Aug, 2020 02:40 IST|Sakshi

బజ్‌రంగ్‌ పూనియా

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా లభించిన సుదీర్ఘ విరామం కొందరు రెజ్లర్లకు చేటు చేసిందని భారత స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా అభిప్రాయపడ్డాడు. టోక్యో బెర్త్‌ పొందిన వారు ప్రశాంతంగా పోటీలకు సిద్ధమవుతున్నారని, ఒలింపిక్స్‌కు అర్హత సాధించాల్సిన వారికే ఈ విరామం సవాలుగా మారిందని అన్నాడు. ఇన్‌స్పైర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఐఐఎస్‌)లో ఇటీవలే ప్రాక్టీస్‌ ప్రారంభించిన బజ్‌రంగ్‌ వెబినార్‌లో మాట్లాడుతూ... ‘ఒలింపిక్స్‌లో ఎలా సత్తా చాటాలనే అంశంపై నేనో దృక్పథంతో ప్రాక్టీస్‌ చేస్తున్నా. కానీ ఇంకా అర్హత సాధించాల్సిన వారే తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. ఈ విరామం వారి ఫిట్‌నెస్‌కు సవాలుగా నిలిచింది. నేనైతే లాక్‌డౌన్‌లోనూ ప్రతీరోజు ట్రెయినింగ్‌లో పాల్గొన్నా. నన్ను నిత్యం ప్రేరేపించేవారు నా చుట్టూ ఉన్నారు’ అని బజ్‌రంగ్‌ వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు