అమెరికాలోనే మరో నెల రోజులు

6 Jan, 2021 08:45 IST|Sakshi

రెజ్లర్‌ బజరంగ్‌ ప్రాక్టీస్‌కు ‘సాయ్‌’ అనుమతి

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాకు మరో నెల రోజులు అదనంగా అమెరికాలో ప్రాక్టీస్‌ చేసే అవకాశం లభించింది. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగంలో ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ సాధించిన బజరంగ్‌ డిసెంబర్‌ 4 నుంచి మిచిగాన్‌లోని క్లిఫ్‌ కీన్‌ రెజ్లింగ్‌ క్లబ్‌లో సాధన చేస్తున్నాడు. ఫిబ్రవరి మొదటి వారం వరకు అతను అక్కడే ప్రాక్టీస్‌ చేసే వీలు కలి్పస్తూ గతవారం ఒలింపిక్‌ సెల్‌ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) వెల్లడించింది.

ఇందుకు అయ్యే రూ. 11.65 లక్షల వ్యయాన్ని భరిస్తామని తెలిపింది. క్లిఫ్‌ కీన్‌ రెజ్లింగ్‌ క్లబ్‌లో నాణ్యమైన ప్రాక్టీస్‌ లభిస్తోందని బజరంగ్‌ పేర్కొన్నాడు. ‘ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. మంచి భాగస్వాములు అందుబాటులో ఉన్నారు. భారత్‌లో 74 కేజీలు, 79 కేజీల కేటగిరీ భాగస్వాములతో ప్రాక్టీస్‌ చేసేవాడిని. ఇక్కడ నా వెయిట్‌ కేటగిరీకి చెందిన రెజ్లర్లతో సాధన చేస్తున్నా’ అని బజరంగ్‌ తెలిపాడు. మార్చిలో రోమ్‌ టోరీ్నతో ఈ ఏడాది పతకాల వేటను ప్రారంభిస్తానన్నాడు. (చదవండి: భారత జట్టుకు నిరాశ )

మరిన్ని వార్తలు