SL VS IRE 2nd Test: ఐర్లాండ్‌ బ్యాటర్ల ఆధిపత్యం.. తేలిపోయిన లంక బౌలర్లు, మరో 20 పరుగులు చేస్తే రికార్డు

25 Apr, 2023 06:51 IST|Sakshi

గాలె: శ్రీలంకతో సోమవారం మొదలైన రెండో టెస్టులో ఐర్లాండ్‌ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఐర్లాండ్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 319 పరుగులు సాధించింది. కెప్టెన్‌ ఆండీ బాల్బిర్నీ (163 బంతుల్లో 95; 14 ఫోర్లు) ఐదు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. పాల్‌ స్టిర్లింగ్‌ (133 బంతుల్లో 74 రిటైర్డ్‌హర్ట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), లొర్కాన్‌ టకర్‌ (102 బంతుల్లో 78 బ్యాటింగ్‌; 10 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీలు చేశారు.

బాల్బిర్నీ, స్టిర్లింగ్‌ నాలుగో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. టెస్టుల్లో ఐర్లాండ్‌ జట్టుకు ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. మరో 20 పరుగులు సాధిస్తే ఐర్లాండ్‌ టెస్టుల్లో తమ అత్యధిక స్కోరును నమోదు చేస్తుంది. టకర్‌కు జతగా ప్రస్తుతం కాంఫెర్‌ (27 బ్యాటింగ్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజులో ఉన్నాడు. లంక స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య రెండు వికెట్లు పడగొట్టాడు.    

మరిన్ని వార్తలు