European Cricket League: 'దరిద్రం నెత్తిన ఉందంటారు'.. అది ఇదేనేమో?

25 Dec, 2022 15:48 IST|Sakshi

రనౌట్‌లు కొన్నిసార్లు ఊహించని విధంగా జరుగుతుంటాయి. ఒక్కోసారి బ్యాట్స్‌మెన్‌ గ్రహచారం బాగాలేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు. అలాంటి రనౌట్స్‌ మనకు నవ్వు తెప్పించినప్పటికి బ్యాటర్‌కు మాత్రం చిర్రెత్తిస్తాయి. గతంలో ఇలాంటివి చాలానే జరిగాయి. తాజాగా యూరోపియన్‌ క్రికెట్‌ లీగ్‌లో భాగంగా ఒక ఫన్నీ రనౌట్‌ చోటుచేసుకుంది. 

ఫ్యాన్‌కోడ్‌ ఈసీఎస్‌ మాల్టా గేమ్‌లో భాగంగా ఓవర్సీస్‌ క్రికెట్‌, స్వీకీ యునైటెడ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఓవర్సీస్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ గెరిక్‌ బౌన్స్‌ అయిన బంతిని ఆఫ్‌సైడ్‌ దిశగా ఆడాడు. అయితే బౌలర్‌ బంతిని అందుకునే ప్రయత్నంలో మిస్‌జడ్జ్‌ అయ్యాడు. దీంతో బంతి అతని నెత్తికి తాకి దిశను మార్చుకుంది. ఇంతలో పరుగు తీయడానికి ప్రయత్నించగా.. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్‌ నేరుగా వికెట్లవైపు విసిరాడు. అంతే 20 బంతుల్లో 44 పరుగులతో దాటిగా ఆడుతున్న గ్రీక్‌ కథ అ‍క్కడితో ముగిసింది.

'' దరిద్రం నెత్తిన ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు.. అయితే ఇక్కడ దరిద్రం బ్యాటర్‌ నెత్తిలో కాకుండా బౌలర్‌ నెత్తిపై ఉండడం అది బ్యాటర్‌కు శాపంగా మారిదంటూ..'' కామెంట్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఓవర్సీస్‌ క్రికెట్‌ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 104 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన స్వికీ యునైటెడ్‌ నిర్ణీత 10 ఓవర్లలో 89 పరుగులు మాత్రమే చేసి 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

చదవండి: చిన్న టార్గెట్‌కే కిందా మీదా .. ఇలాగైతే డబ్ల్యూటీసీ గెలిచేదెలా?

మరిన్ని వార్తలు