BANW Vs PAKW: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ .. వరల్డ్‌కప్‌ నుంచి పాకిస్తాన్‌ ఔట్‌!

14 Mar, 2022 12:49 IST|Sakshi

మహిళల వన్డే ప్రపంచకప్‌-2022లో బంగ్లాదేశ్‌ తొలి విజయం నమోదు చేసింది. హామిల్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన లీగ్‌​ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. దీంతో వన్డేల్లో పాకిస్తాన్‌పై తొలి విజయం సాధించి బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. ఇక పాకిస్తాన్‌ ఈ మెగా టోర్నమెంట్‌లో వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 225 పరుగులు మాత్రమే చేయగల్గింది. పాకిస్తాన్‌ బ్యాటర్లలో సిద్రా అమీన్ ఆద్భుతమైన సెంచరీ సాధించనప్పటికీ ఫలితం లేక పోయింది. మిడిలార్డర్‌ బ్యాటర్లు విఫలం కావడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. 

ఇక బంగ్లాదేశ్‌ బౌలర్లలో ఫాహిమా ఖాటాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. రుమానా అహ్మద్ రెండు, ఆలాం ఒక్క వికెట్‌ సాధించారు. కాగా అంతకుమందు బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 7 వికెట్లు నష్టానికి 234 పరుగులు చేసింది. బం‍గ్లా బ్యాటర్లలో ఫర్గానా హాక్‌(71), నిగర్ సుల్తానా(46) పరుగులతో రాణించారు. కాగా వరుస ఓటమిలతో పాయింట్ల పట్టికలో అఖరి స్ధానంలో పాక్‌ నిలిచింది. ఇక పాకిస్తాన్‌ సెమీస్‌కు చేరడం కష్టమే అని చెప్పుకోవాలి.

చదవండి: Ind VS Sl 2nd Test: ఛ.. నాకే ఎందుకిలా జరుగుతోంది? కోహ్లి వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు