'బంగ్లాదేశ్ ఆటగాళ్లకు టెస్టు క్రికెట్‌ ఆడే ఆలోచన లేదు'

9 May, 2022 21:35 IST|Sakshi

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తమ జాతీయ జట్టుపై విమర్శలు గుప్పించాడు. తమ ఆటగాళ్లకు టెస్ట్‌ క్రికెట్‌ ఆడే ఆలోచన లేదని అతడు తెలిపాడు. కాగా ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో బంగ్లాదేశ్‌.. ఘోర పరాభావం మూటకట్టుకుంది. రెండు టెస్టుల సిరీస్‌ను  దక్షిణాఫ్రికా క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక మే 15 నుంచి శ్రీలంకతో స్వదేశంలో బంగ్లాదేశ్‌ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. టెస్టుల్లో మా జట్టు ఎందుకు ఇలా ఆడుతుందో నాకు ఆర్ధం కావడం లేదు. గత ఐదు టెస్టుల్లో ఇదే పరిస్ధితి కన్పిస్తోంది. సిరీస్‌ తొలి టెస్టులో జట్టు గట్టి పోటీ ఇస్తుంది. కానీ రెండో టెస్టులో చిత్తుగా ఓడి పోతున్నాం.

స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో‌, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో కూడా ఇలాగే జరిగింది. మా జట్టు ఆటగాళ్లు దీశీవాళీ టోర్నీల్లో ఎక్కువగా పాల్గొనరు. అదే విధంగా వారి​కి టెస్టు క్రికెట్‌ ఆడే ఆలోచనే లేదు.  ఇప్పుడు అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాం. వారిని దేశవాళీ క్రికెట్ ఆడేలా చేయలేము. లేదంటే  దేశీయ క్రికెట్‌ను కొన్ని రోజులు వాయిదా వేయాలి" అని ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నజ్ముల్ హసన్ పేర్కొన్నాడు.

చదవండి: IPL 2022: కాన్వేకు పెళ్లి వర్కౌట్‌ అయినట్లుంది.. మొయిన్‌ అలీ ఫన్నీ కామెంట్‌

మరిన్ని వార్తలు