బంగ్లాదేశ్‌ 294/8

8 Jul, 2021 05:29 IST|Sakshi

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మెన్‌ లిటన్‌ దాస్‌ (95; 13 ఫోర్లు), కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌ (70; 13 ఫోర్లు), మహ్ముదుల్లా (54 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) రాణించారు. దీంతో బుధవారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. ఆరంభంలో 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన బంగ్లాను కెప్టెన్‌ హక్‌ ఆదుకున్నాడు. ఆ తర్వాత షకీబ్‌ (3), ముష్ఫికర్‌ (11) నిర్లక్ష్యంతో మళ్లీ బంగ్లా 132 పరుగుల వద్ద 6 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో లిటన్, మహ్ముదుల్లా ఏడో వికెట్‌కు 138 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆట నిలిచే సమయానికి  మహ్ముదుల్లాతో పాటు టస్కిన్‌ అహ్మద్‌ (13 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఆతిథ్య జింబాబ్వే బౌలర్లలో ముజరబని 3, టిరిపానో, విక్టర్‌ న్యౌచీ చెరో 2 వికెట్లు పడగొట్టారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు