ECS T10 League: బౌండరీ కొట్టాలని చూశాడు.. దురదృష్టం వెంటాడింది

26 Nov, 2021 20:04 IST|Sakshi

Batsman Bizzare Dismissal Became Viral In ECS T10 league.. క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ ఫన్నీవేలో ఔటవ్వడం చాలానే చూసుంటాం. కొన్నిసార్లు నవ్వొస్తో.. మరికొన్ని సార్లు జాలిపడ్డాం. తాజాగా యూరోపియన్‌ క్రికెట్‌ సిరీస్‌ టి10లీగ్‌లోనూ ఇలాంటిదే చోటుచేసుకుంది. మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌ ఫైన్‌లెగ్‌ దిశగా బౌండరీ కొట్టాలని చూశాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్‌ చోటుచేసుకుంది. టైమ్‌లైన్‌ మిస్‌ కావడంతో బ్యాట్‌ ఎడ్జ్‌ తగిలిన బంతి కీపర్‌ హెల్మెట్‌కు తాకి థర్డ్‌మన్‌ దిశగా వెళ్లింది. అక్కడే ఉన్న ఫీల్డర్‌ క్యాచ్‌ పట్టడంతో బ్యాట్స్‌మన్‌ ఔటయ్యాడు.

రూల్స్‌ ప్రకారం బంతి నేలను తాకక ముందు ఎక్కడ తగిలినప్పటికి ఫీల్డర్‌ క్యాచ్‌ పడితే అది ఔట్‌గా పరిగణిస్తారు.  దీంతో చేసేదేంలేక బ్యాట్స్‌మన్‌ భారంగా వెనుదిరిగాడు. అయితే అంపైర్లు మాత్రం మొదట బ్యాటర్‌ ఔట్‌ కాదనుకున్నారు. కానీ రిప్లైలో చూస్తే ఔట్‌ అని స్పష్టంగా కనిపించింది. అయితే ఇలాంటి విచిత్రమైన ఔట్‌ ఎప్పుడు చూడలేదని మ్యాచ్‌ అనంతరం అంపైర్లు పేర్కొనడం ఫన్నీగా అనిపించంది. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు