Viral Video: ఔటయ్యాననే కోపంతో బ్యాట్‌ విసిరాడు.. అది కాస్తా..

21 Sep, 2021 18:42 IST|Sakshi

Batsman Swing Bat After Run Out Hurts Team Mate.. క్రికెట్‌లో ఫన్నీ ఘటనలు జరగడం సహజం. ఆ ఫన్నీ కాస్త శృతిమించితే  సీరియస్‌గా మారిపోతుందనే దానికి ఈ సంఘటనే ఉదాహరణ. రనౌట్‌ అయ్యాననే కోపంతో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌ బ్యాట్స్‌మన్‌ తన బ్యాట్‌ను కోపంతో విసిరాడు. అది కాస్త వెళ్లి ఎవరు ఊహించని రీతిలో స్ట్రైకింగ్‌ బ్యాట్స్‌మన్‌ ముఖానికి తగిలింది. ఈ హఠాత్మపరిణామంతో ఆ ఆటగాడు షాక్‌కు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా మాజీ క్రికెటర్‌ .. కేకేఆర్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 

చదవండి: KL Rahul: 22 పరుగుల దూరం.. ఐపీఎల్‌ చరిత్రలో రెండో బ్యాట్స్‌మన్‌గా

విషయానికి వస్తే.. క్లబ్‌ క్రికెట్‌లో ఇది చోటుచేసుకుంది. బౌలర్‌ బంతి విసరగా.. స్ట్రైకింగ్‌ బ్యాట్స్‌మన్‌ గల్లీ దిశగా షాట్‌ ఆడాడు. నాన్‌స్ట్రైకింగ్‌ బ్యాట్స్‌మన్‌కు పరుగు కోసం కాల్‌ ఇచ్చాడు. దీంతో అవతలి ఎండ్‌ నుంచి బ్యాట్స్‌మన్‌ సగం వరకు చేరుకున్నాడు. అయితే ఫీల్డర్‌ బంతిని అందుకోవడంతో స్ట్రైకింగ్‌ బ్యాట్స్‌మన్‌ వెనక్కి తగ్గాడు. అప్పటికే బంతి వికెట్లను గిరాటేయడంతో నాన్‌స్ట్రైక్‌ బ్యాట్స్‌మన్‌ రనౌట్‌ అయ్యాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు కథ ఇక్కడే మొదలైంది. రనౌట్‌ అయ్యాననే కోపంతో బ్యాట్‌ను విసిరేయగా.. అది వెళ్లి నేరుగా స్ట్రైకింగ్‌ బ్యాట్స్‌మన్‌ ముఖానికి తగిలింది.

చదవండి: IPL 2021: అఫ్గాన్‌లో ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం.. మహిళలే కారణమట..!

వెంటనే ఫిజియో థెరపీ వచ్చి అతన్ని పరీక్షించాడు. అదృష్టవశాత్తు ఆ బ్యాట్స్‌మన్‌కు ఏం కాలేదు. ఇది ఊహించని నాన్‌స్ట్రైకింగ్‌ బ్యాట్స్‌మన్‌ అతని వద్దకు పరిగెత్తుకు వచ్చి ఏమైందో అని కంగారు పడిపోయాడు. ఈ వీడియో చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ యాదృశ్చికంగా జరిగిందా లేక కావాలనే చేశాడా అని అభిప్రాయపడుతున్నారు.  ఇక హర్భజన్‌ సింగ్‌ ప్రస్తుతం కేకేఆర్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో హర్భజన్‌ 163 మ్యాచ్‌లాడి 150 వికెట్లు తీశాడు.

A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3)

>
మరిన్ని వార్తలు