వైరల​ : బంతి జెర్సీలో దాచి పరుగు పెట్టాడు

12 Dec, 2020 16:05 IST|Sakshi

కాన్‌బెర్రా : బిగ్‌బాష్‌ లీగ్‌ 2020లో శనివారం మెల్‌బోర్న్‌ స్టార్స్‌, సిడ్నీ థండర్స్‌ మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఇన్నింగ్‌ ఆఖరి ఓవర్లో డేనియల్‌ సామ్స్‌ వేసిన బంతిని బ్యాట్స్‌మెన్‌ లార్కిన్‌ ఫ్లిక్‌ చేశాడు. అయితే పొరపాటున బంతి లార్కిన్‌ జెర్సీలోకి దూరిపోయింది. అయితే లార్కిన్‌‌ కొట్టిన బంతి ఎక్కడా కనిపించకపోవడంతో సిడ్నీ థండర్స్‌ ఆటగాళ్లు కన్య్ఫూజ్‌ అయ్యారు. ఈ విషయం గమనించని లార్కిన్‌ నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌ పిలుపుతో లార్కిన్‌ సింగిల్‌ పూర్తి చేశాడు. అతను సింగిల్‌ పూర్తి చేసే క్రమంలో జెర్సీ నుంచి బంతి కిందకు జారింది. (చదవండి : ఆసీస్‌కు మరో దెబ్బ.. కీలక బౌలర్‌ ఔట్‌!)

దీంతో అవాక్కైన ఫీల్డర్లు ఇది ఛీటింగ్.. రనౌట్‌ తప్పించుకోవాలనే ‌అలా చేశాడని..‌ అతని సింగిల్‌ చెల్లదని అంపైర్‌కు ఫిర్యాదు చేశారు. ఫీల్డ్‌ అంపైర్లు పరిశీలించి లార్కిన్‌ తీసిన సింగిల్‌ను రద్దు చేసి అతన్ని మళ్లీ స్ట్రైకింగ్‌కు పంపించారు. ఈ సంఘటనతో  మైదానంలో కాసేపు డ్రామా నెలకొంది. ఈ వీడియోనూ బిగ్‌బాష్‌ లీగ్‌ నిర్వాహకులు ట్విటర్‌ షేర్‌ చేశారు. ' రనౌట్‌ తప్పించుకునేందుకు బంతిని జెర్సీలో దాచి పరుగులు పెట్టాడు... ఎంతైనా లార్కిన్‌ ఇంటలిజెంట్‌ బ్యాట్స్‌మెన్‌' అని సరదాగా కామెంట్‌ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఆ తర్వాత బంతికే లార్కిన్‌ రన్‌ఔట్‌ అయ్యాడు.. ఈసారి మాత్రం అతన్ని అదృష్టం వరించలేదు. (చదవండి : క్యాచ్‌ వదిలేశాడని బౌలర్‌ బూతు పురాణం)

ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్స్‌ స్టార్స్‌ 22 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ జట్టులో స్టోయినిస్‌ 61, మ్యాక్స్‌వెల్‌ 39 పరుగులతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. పెర్గూసన్‌ 54 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అలెక్స్‌ హేల్స్‌ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. (చదవండి : నా తండ్రి వ్యాఖ్యలు నన్ను బాధించాయి)

మరిన్ని వార్తలు