వికెట్ల ముందే ఆడాలని రూల్‌ లేదు.. అందుకే వెనకాల

4 Nov, 2022 15:26 IST|Sakshi

సాధారణంగా క్రికెట్‌లో ఏ బ్యాటర్‌ అయినా సరే క్రీజులోకి వస్తే వికెట్ల ముందు నిలబడి స్ట్రైక్‌ తీసుకోవడం ఆనవాయితీ. అయితే వికెట్ల ముందు నిలబడే ఆడాలని ఎక్కడా రూల్‌ లేదు. వికెట్ల వెనకాల వెళ్లి కూడా బ్యాటింగ్‌ చేయొచ్చు. కానీ అలా చేస్తే బాగోదు గనుక ఎవరు ఆ పని చేయరు. అయితే తాజాగా మాత్రం ఇండియన్‌ క్లబ్‌ క్రికెట్‌లో మ్యాచ్‌లో ఒక బ్యాటర్‌ స్టంప్స్‌ వెనకాల నిలబడ్డాడు. బౌలర్‌ బంతి విడుదల చేయగానే వికెట్ల ముందుకొచ్చి ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా భారీ సిక్సర్‌ సందించాడు.

అతను కొట్టిన సిక్సర్‌ హైలైట్‌ అనుకుంటే.. అతను బ్యాటింగ్‌ చేసిన తీరు ఇంకా హైలైట్‌గా నిలిచింది. అయితే ఇలా బ్యాటింగ్‌ చేయడంలో ఎలాంటి రూల్స్‌ లేవు కానీ.. ఒకవేళ​ ప్రత్యర్థి జట్టు తమ వికెట్‌ కీపర్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు అంపైర్‌కు అప్పీల్‌ చేస్తే మాత్రం సదరు బ్యాటర్‌ను ఔట్‌గా పరిగణించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యర్థి జట్టు ఎలాంటి అప్పీల్‌ చేయకపోవడంతో పరుగులు రావడంతో పాటు బ్యాటర్‌ హైలైట్‌గా మారాడు. 

2005లో అక్తర్‌ బౌలింగ్‌లో బ్రాడ్‌ హడిన్‌ ఇలాగే..
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఘటన ఇప్పటివరకు పెద్దగా చోటుచేసుకోలేదు. అయితే 2005-06లో పాకిస్తాన్‌ ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆస్ట్రేలియా-ఏతో పాక్‌ అడిలైడ్‌ వేదికగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడింది. ఫ్రీ హిట్‌ను అప్పుడప్పుడే అమల్లోకి తెచ్చారు.  ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ పాక్‌ తరపున రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ వేయగా.. ఆస్ట్రేలియా-ఏ ఇన్నింగ్స్‌ను బ్రాడ్‌ హడిన్‌, జేమ్స్‌ హోప్స్‌లు ప్రారంభించారు. అయితే అక్తర్‌ నోబాల్‌ వేయడంతో అంపైర్‌ ఫ్రీహిట్‌ ఇచ్చాడు. ఫ్రీహిట్‌ అంటే కేవలం రనౌట్‌ తప్ప ఎలా ఔట్‌ అయినా పరిగణించరు.

ఈ రూల్‌ను అడ్వాంటేజ్‌ తీసుకున్న బ్రాడ్‌ హడిన్‌.. అక్తర్‌ 155 కిమీ వేగంతో వేసిన డెలివరీ ఆడేందుకు వికెట్ల వెనకాలకు వెళ్లి బ్యాటింగ్‌ చేశాడు. మిడ్‌ వికెట్‌ మీదుగా షాట్‌ ఆడి రెండు పరుగులు సాధించాడు. అయితే అక్తర్‌ మరోసారి నోబాల్‌ వేయడంతో ఫ్రీహిట్‌ అలాగే ఉండిపోయింది. దీంతో తర్వాత బంతిని అక్తర్‌ స్ట్రెయిట్‌ స్లో డెలివరీ వేశాడు. ఈసారి కూడా హడిన్‌ వికెట్ల వెనకాల వెళ్లి బ్యాటింగ్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌ను తాకడంలో విఫలం కావడంతో వికెట్లను గిరాటేసింది. అయితే ఫ్రీహిట్‌ అమల్లో ఉండడంతో హడిన్‌ ఔట్‌ కాకపోవడంతో బై రూపంలో మరో రన్‌ వచ్చింది. అప్పట్లో హడిన్‌ చర్య సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయింది. 

చదవండి: Aus Vs Afg: అఫ్గన్‌తో కీలక మ్యాచ్‌.. ఆసీస్‌ స్కోరు ఎంతంటే

మహ్మద్‌ నవాజ్‌ రనౌటా లేక ఎల్బీనా?

మరిన్ని వార్తలు